Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక మాములు బస్సు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో దేశాల్లో ఎన్నో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నారు. 1975లో దర్శకుడు కె.బాలచందర్ అపూర్వ రాగంగళ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు రజనీకాంత్. మొదట విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి ఆ తర్వాత హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ సాధించారు. తాజాగా రజినీకాంత్ సినీ రంగ ప్రవేశం చేసి 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రజినీకాంత్ నటుడిగా 47 ఏళ్ళు పూర్తిచేసుకున్నందుకు గాని ఆయన సతీమణి లతా రజనీకాంత్ స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. 47 ఇయర్స్ ఆఫ్ రజినిఇజం అని బ్యానర్ వేయించి, పుష్పగుచ్చం ఇచ్చి, కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేయించారు ఆయన సతీమణి. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తున్నారు.