Chandrababu Naidu
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కుప్పంలో చంద్రబాబు రోడ్ షో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడబోనని, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డే తన జోలికి రావడానికి భయపడ్డాడని చంద్రబాబు అన్నారు. ‘‘సుజల వాటర్ ప్లాంట్లపై బొమ్మ వేసుకోవడానికి సిగ్గుండాలి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రైతులు తిరగబడాలి.
Phone Tapping Row : ఫోన్ ట్యాపింగ్ వివాదం.. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్
ఇప్పటివరకు రాష్ట్రంలో 60 మంది టీడీపీ ముఖ్యనేతలఫై కేసులు పెట్టారు. నారాయణ ఏ తప్పు చేశారని అరెస్టు చేశారో ప్రభుత్వం చెప్పాలి. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? రాజకీయ కక్షతోనే నారాయణను అరెస్టు చేశారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.