Modi Amit Shah
union cabinet: కేంద్ర కేబినెట్‌లో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన మరో ఎంపీకి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటు చేసుకుంటే తెలంగాణకు చెందిన ఓ నేతకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ నేత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.
China-India: మరోసారి దుస్సాహసానికి పాల్పడ్డ చైనా
రాజ్యసభ సభ్యులుగా పదవీ కాలం ముగియడంతో తాజాగా ముక్తార్ అబ్బాస్ నక్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి పదవికి, ఆర్‌సీపీ సింగ్ ఉక్కు శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయా పదవుల్లో కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మైనారిటీ వ్యవహారాలు, ఉక్కు శాఖలను భర్తీ చేసే అవకాశం ఉంది. అంతేగాక, పనితీరు అంతగా బాగోలేని కొందరు మంత్రులను తప్పిస్తారని తెలుస్తోంది. దీంతో వచ్చే రెండేళ్ళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నిక అనంతరం కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం.