China-India: మ‌రోసారి దుస్సాహ‌సానికి పాల్ప‌డ్డ చైనా

చైనా త‌న బుద్ధి మార్చుకోవ‌డం లేదు. శాంతి మంత్రం జ‌పిస్తూనే ఉద్రిక్త‌త‌లు రేపేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈశాన్య లద్దాఖ్‌ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోకి చైనా యుద్ధ విమానం దూసుకువ‌చ్చిన ఘ‌ట‌న మీడియాకు ఆల‌స్యంగా తెలిసింది.

China-India: మ‌రోసారి దుస్సాహ‌సానికి పాల్ప‌డ్డ చైనా

Ladakh

China-India: చైనా త‌న బుద్ధి మార్చుకోవ‌డం లేదు. శాంతి మంత్రం జ‌పిస్తూనే ఉద్రిక్త‌త‌లు రేపేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈశాన్య లద్దాఖ్‌ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోకి చైనా యుద్ధ విమానం దూసుకువ‌చ్చిన ఘ‌ట‌న మీడియాకు ఆల‌స్యంగా తెలిసింది. జూన్‌ చివరి వారంలో ఆ ప్రాంతంలోకి చైనా యుద్ధ విమానం దూసుకు వ‌చ్చి, తిగిరి వెళ్ళిపోయింది. చైనా నుంచి ఎటువంటి ప‌రిస్థితులు ఎదురైనా వెంట‌నే స్పందించి, ఆ దేశ చ‌ర్య‌ల‌ను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని భారత వైమానిక దళం పేర్కొంది. ల‌ద్దాఖ్ ప్రాంతంలో కొన్ని నెలలుగా చైనా ఇటువంటి దుస్సాహ‌సానికి పాల్ప‌డ‌లేదు.

Maharashtra: శివ‌సేన‌కు ఉద్ధ‌వ్ ఠాక్రేనే చీఫ్‌.. రెబ‌ల్ ఎమ్మెల్యేల గ్రూపున‌కు గుర్తింపులేదు: ఎంపీ సావంత్

ఇప్పుడు మ‌ళ్ళీ త‌న తీరును ప్ర‌ద‌ర్శిస్తూ యుద్ధ విమానాన్ని పంపి క‌ల‌క‌లం రేపింది. చైనా చ‌ర్య‌ల‌పై భార‌త్ సరిహద్దు ప్రాంతాల్లో నిరంత‌రం నిఘా ఉంచుతోంది. చైనా యుద్ధ విమానాలు దూసుకొస్తే రాడార్‌ల సాయంతో భార‌త వైమానిక దళం గుర్తిస్తోంది. తూర్పు లద్దాఖ్‌కు సమీపంలో చైనా ఆర్మీ మౌలిక స‌దుపాయాలు పెంచుకుంటూ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న వేళ యుద్ధ విమానంతో మ‌రో దుస్సాహ‌సానికి పాల్ప‌డ‌డం గ‌మ‌నార్హం. సరిహ‌ద్దుల వ‌ద్ద‌ చైనా పాల్ప‌డుతోన్న‌ చర్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. చైనా నుంచి ఎటువంటి ముప్పు ఎదురైనా స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉంది.