Chatpata Dancing Bhelpuri : ‘చత్పటా డ్యాన్సింగ్ భేల్‌‌పురి’.. ఆకట్టుకుంటున్న స్ట్రీట్ ఫుడ్

వ్యాపారం చేయాలంటే చాలా టెక్నిక్స్ వాడాలి. అదీ రోడ్ సైడ్ బిజినెస్‌లో కస్టమర్లను ఆకట్టుకోవాలంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలి. 'చత్పటా డ్యాన్సింగ్ భేల్‌‌పురి' అట.. ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. దీని స్పెషల్ ఏంటో తెలుసుకోవాలని ఉందా?

viral video : ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం వ్యాపారులు అమ్మే పదార్ధాల్లో కొత్త రుచులను కలుపుతుంటారు. అలాగే అమ్మే విధానంలో కూడా ప్రత్యేకతను చాటుకుంటారు. ఓ స్ట్రీట్‌లో భేల్‌‌పురి అమ్మే వ్యక్తి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీని పేరు ‘చత్పటా డ్యాన్సింగ్ భేల్‌‌పురి’ అట.

Heimlich Maneuver : తింటున్న ఫుడ్ గొంతులో ఇరుక్కుంది.. హీమ్లిచ్ టెక్నిక్‌తో సోదరుడిని కాపాడిన సిస్టర్

aapkabhai_foody అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఓ స్ట్రీట్ ఫుడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘భేల్‌‌పురిని అమ్మడం ద్వారా లక్షాధికారిని అయ్యాను’ అనే క్యాప్షన్‌‌తో ఈ వీడియో షేరైంది. మరమరాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పూరీ, చట్నీ, బంగాళాదుంపలు మసాలాతో సహా భేల్‌‌పురికి కావాల్సిన పదార్ధాలను పెద్ద పాత్రలో ఒక వ్యక్తి కలపడం మొదలు పెడతాడు. ఇందులో 60 పదార్ధాలు కలుపుతాడట. చేతిలో గ్రాండ్ స్పూన్‌తో డ్యాన్స్ చేస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటూ భేల్‌‌పురిని పాత్రలో తిప్పుతాడు.

Paan Burger : ‘పాన్ బర్గర్ అంట’.. కొత్త కాంబినేషన్ చూసి మండిపడుతున్న ఫుడ్ లవర్స్

అతను ఎంతో యాక్టివ్‌గా తయారు చేసే విధానం అందర్నీ ఆకట్టుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో 30 మిలియన్ల వ్యూస్ దాటి దూసుకుపోతోంది. ‘అతని డ్యాన్స్‌తో రుచి మారుతుందా?’ అని ఒకరు.. ‘అతను శాంతించాలి’ అంటూ మరొకరు ఫన్నీగా రిప్లైలు ఇచ్చారు. ఏదైతే ఏంటి.. తెలివైన వ్యాపారి.. జనాల్ని తన దుకాణం వైపు తిప్పుకునేందుకు క్రియేటివ్‌గా ముందుకు వెళ్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు