Heimlich Maneuver : తింటున్న ఫుడ్ గొంతులో ఇరుక్కుంది.. హీమ్లిచ్ టెక్నిక్‌తో సోదరుడిని కాపాడిన సిస్టర్

ఏదైనా ఆహారం తింటున్నప్పుడు సడెన్‌గా గొంతులో అడ్డుపడటం సాధారణంగా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. కొందరికి ఆ సమయంలో ఉక్కిరి బిక్కిరై ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. తన సోదరుడికి అలాంటి సమస్య ఎదురైనపుడు అతని సోదరి ఎలా కాపాడిందో చదవండి.

Heimlich Maneuver : తింటున్న ఫుడ్ గొంతులో ఇరుక్కుంది.. హీమ్లిచ్ టెక్నిక్‌తో సోదరుడిని కాపాడిన సిస్టర్

Heimlich Maneuver

sister saved her younger brother : ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు సడెన్‌గా గొంతులో ఇరుక్కుంటే ప్రాణం విలవిలలాడిపోతుంది. అనుభవించే వారికే కాదు.. వారి ఇబ్బంది చూసే వారికి కూడా ఏం చేయాలో తోచదు. తన కవల సోదరుడు గొంతులో ఆహారం ఇరుక్కుని అవస్థ పడుతుంటే అతని సోదరి హీమ్లిచ్ టెక్నిక్‌తో కాపాడింది.

Female Uber driver story : బీటెక్ గ్రాడ్యుయేట్ ఉబెర్ డ్రైవర్‌గా ఎందుకు మారింది?

మసాచుసెట్స్‌ లీసెస్టర్ మిడిల్ స్కూలులో చదువుకుంటున్న అమేలియా ఆమె కవల సోదరుడు చార్లీ క్యాంటీన్‌లో తింటున్నారు. అకస్మాత్తుగా అతను తింటున్న ఆహారం గొంతులో ఇరుక్కుపోయింది. ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాడు. గొంతులో ఇరుక్కున్న చీజ్ ముక్కను తీయడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. అతని పరిస్థితిని చూసిన సోదరి అమేలియా వెంటనే కాపాడటానికి లేచింది. వెంటనే హీమ్లిచ్ టెక్నిక్ ద్వారా గొంతుకకు అడ్డుపడ్డ ఆహారం బయటకు వచ్చేలా సాయం చేసింది. వెంటనే అతను సేవ్ అయ్యాడు. nowthisnews అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ద్వారా షేర్ అయిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

Robbery With ‘Newspaper’ Technique : ‘న్యూస్ పేపర్’ టెక్నిక్‌తో ఇల్లు దోచేసిన దొంగలు..

ఇంటర్నెట్ అంతా అమేలియాను ప్రశంసించింది. ఆమెను రియల్ హీరో అంటూ కామెంట్లు పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా హీమ్లిచ్ టెక్నిక్ తెలుసుకోవాలని కూడా సూచించారు.

 

View this post on Instagram

 

A post shared by NowThis (@nowthisnews)