Robbery With ‘Newspaper’ Technique : ‘న్యూస్ పేపర్’ టెక్నిక్‌తో ఇల్లు దోచేసిన దొంగలు..

ఆ దొంగలు వెరీ వెరీ స్మార్ట్. కేవలం ఓ ‘న్యూస్ పేపర్’ను టెక్నిక్ తో లక్షల రూపాల విలువైన నగల్ని దోచుకుపోయారు. మన రోజు చదివే ‘న్యూస్ పేపర్’ను ఇలా దోపిడీకి కూడా ఉపయోగించవచ్చా? అన్నట్లుగా ఉందీ దొంగల దోపిడీకి వాడిన టెక్నిక్ గురించి తెలిస్తే..వారెవ్వా ఏమిరా మీ తెలివి..అనిపిస్తోంది..

Robbery With ‘Newspaper’ Technique : ‘న్యూస్ పేపర్’ టెక్నిక్‌తో ఇల్లు దోచేసిన దొంగలు..

Robbery With 'Newspaper' Technique In  Ghaziabad

Robbery With ‘Newspaper’ Technique In  Ghaziabad : ఆ దొంగలు వెరీ వెరీ స్మార్ట్. కేవలం ఓ ‘న్యూస్ పేపర్’ను టెక్నిక్ గా ఉపయోగించి లక్షల రూపాల విలువైన నగల్ని దోచుకుపోయారు. మన రోజు చదివే ‘న్యూస్ పేపర్’ను ఇలా దోపిడీకి కూడా ఉపయోగించవచ్చా? అన్నట్లుగా ఉందీ దొంగల దోపిడీకి వాడిన టెక్నిక్ గురించి తెలిస్తే..వారెవ్వా ఏమిరా మీ తెలివి..అనిపించకమానదు..

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నివసిస్తున్న రవీంద్రకుమార్ బన్సాల్, అతని భార్య కుమార్తె కలిసి అక్టోబర్ 29న వైష్ణో దేవీ యాత్రకు వెళ్లారు. యాత్రకు వెళ్లి బుధవారం (నవంబర్ 2,2022) తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఐరన్ మెష్ డోర్ కూడా సగం వరకు తెరిచి ఉంది. దీంతో ఆందోళన చెందిన సదరు కుటుంబ సభ్యులు గబగబా ఇల్లంతా పరిశీలించారు. ఇంట్లో ఉన్న రూ.10 లక్షలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు కనిపించలేదు. కప్ బోర్డ్ లో పెట్టిన సూట్స్ కూడా లేవు. ఇంకేముంది దొంగతనం జరిగిందని అర్థమైంది. తాము ఇంట్లో లేమని దొంగలకు ఎలా తెలిసిందా? అని ఆశ్చర్యపోయారు.

ఇంటిని పరిశీలించగా ఓ న్యూస్ పేపర్ పడి ఉండడాన్ని యజమానులు గుర్తించారు. అక్టోబర్ 29వ తేదీనాటి న్యూస్ పేపర్ అది. అంటే ఇంట్లోని వారు యాత్రకు వెళ్లిన రోజే దొంగలు ఆ ఇంటిని పరిశీలించినట్టుగా తేటతెల్లంగా తెలుస్తోంది. న్యూస్ పేపర్ విడిచి పెట్టి, దాన్ని తీసుకున్నదీ, లేనిదీ మరుసటి రోజు వచ్చి వారు దొంగలు చెక్ చేసుకున్నారు. ఆ పేపర్ ఎక్కడ వేసింది అక్కడే ఉండటంతే ఇంట్లో ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నారు. అలా వచ్చిన దొంగలు తాపీగా దోచుకుపోయారు. ఈ విషయాలను ఇంటి యజమాని తన విశ్లేషణతో అంచనా వేశారు. కానీ అదే నిజమని నిర్ధారణ అయ్యింది రవీంద్రకుమార్ ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో…

ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉంటే న్యూస్ పేపర్ అక్కడ ఉండేది కాదు. నిజానికి ఆ ఇంటి వారు ఏ వార్తా పత్రికను కూడా తెప్పించుకోవడం లేదు.అయినా 29వ తేదీ న్యూస్ పేపర్ ఉంది అంటే ఇది దొంగల దోపిడీలో ప్లాన్ అని అర్థం చేసుకున్నారు రవీంద్రకుమార్. ఇంటిలో దోపిడీ జరిగిందని కేవీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.