Woman’s tip for summer : ఏసీ లేదా? అయినా ఎండ వేడి తట్టుకోవచ్చు.. మహిళ చెబుతున్న టెక్నిక్

ఎండ వేడిని తట్టుకోవాలంటే ఏం చేస్తాం? ఇంట్లో ఏసీలు, కూలర్లు ఆన్ చేసుకుని కూర్చోవడం తప్ప.. కానీ ఇవేమీ లేకుండా కూడా ఎండ వేడిని తట్టుకోవచ్చు.. ఎలా అంటారా? ఓ మహిళ షేర్ చేసిన వీడియో చూస్తే అందరూ ఆలోచిస్తారు.

Woman’s tip for summer : ఏసీ లేదా? అయినా ఎండ వేడి తట్టుకోవచ్చు.. మహిళ చెబుతున్న టెక్నిక్

Woman's tip for summer

Woman’s tip for summer :  ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకప్పటి వాతావరణ పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా మార్పు వచ్చింది. అందుకు కారణం ఏంటో మనందరికీ తెలుసు.. తెలియని వారికి ఓ మహిళ ప్రయోగ పూర్వకంగా కళ్లముందు ఉంచింది. ఇంతకీ ఆ మహిళ షేర్ చేసిన వీడియోలో ఏం ఉంది..?

Hot Summer : సమ్మర్ స్ట్రోక్.. ఏపీ ప్రజలకు అలర్ట్, మరింత పెరగనున్న ఎండల తీవ్రత

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు ఆశ్రయించక తప్పట్లేదు. అసలు ఈ పరిస్థితి రావడానికి మనమూ కొంత కారణం. ఎక్కడ పడితే అక్కడ మొక్కల్ని నరికేయడం..అడవుల్ని సైతం ఆక్రమించడం ఇవన్నీ ప్రధాన కారణం. సిటీల్లో ఎక్కడ చూసినా అపార్ట్ మెంట్ లైఫ్. భవనాల నిర్మాణం కోసం కూడా అనేక మొక్కలు నరికివేయబడుతున్నాయి. దీనివల్ల పచ్చదనం.. ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన గాలి అనేది దొరకడం లేదు. వాతావరణంలో ఉష్ణోగ్రతల స్ధాయి పెరగడానికి మొక్కలు లేకపోవడం కూడా ప్రధాన కారణం. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ఓ మహిళ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సమ్మర్‌లో కీరదోసతో ఉప‌యోగాలేమిటంటే?

సుభాషిణి చంద్రమహి అనే మహిళ ఎండలో ఉన్నప్పుడు, చెట్టు నీడలో ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలో వచ్చిన తేడాను తెలియజేస్తూ ఓ వీడియో చేసారు. దానిని తన ఖాతాలో షేర్ చేసారు. సూర్యుని కింద ఉన్నప్పుడు 41 డిగ్రీల సెల్సియస్ వరకూ చూపించిన ఉష్ణోగ్రతలు.. చెట్టు నీడకు రాగానే 27 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ వీడియో చూసిన జనం కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసినా కూడా చెట్లను నరికివేస్తున్నాము అని కొందరు.. దురదృష్టవశాత్తు పెరుగుతున్న జనాభా.. అవసరాల కోసం మనం చెట్లను నరికివేస్తున్నాం అని మరికొందరు సమాధానాలు ఇచ్చారు. మనిషికి ప్రాణం ఇచ్చే చెట్లు ఎక్కడికక్కడ తెగ నరకడం వల్ల ఏటా వేసవికాలంలో ఉష్ణోగ్రతలు తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చెట్లను కాపాడుకుంటే మన వాతావరణం ఎంత చల్లగా ప్రశాంతంగా ఉంటుందో.. మానవాళి మనుగడకు చెట్లు ఎంత అవసరమో సుభాషిణి చంద్రమహి వీడియో మరోసారి స్పష్టం చేస్తోంది.