రోజులో ఒక్క పూట భోజనం..కుక్కల కోసం త్యాగం

  • Publish Date - May 24, 2020 / 05:51 AM IST

కరోనా వైరస్ ఎంతో మందిని కష్టాల పాలు చేస్తోంది. ఉపాదిని దెబ్బతీసింది. జంతువులకు ఆహారం లేకపోవడంతో విలవిలలాడుతున్నాయి. దీనిని గమనించిన కొంతమంది జంతు ప్రేమికులు వాటికి ఆహారం అందించేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా తన ఇంట్లో ఉన్న 13 కుక్కల కోసం ఓ మహిళ రోజులో ఒకేసారి భోజనం చేస్తోంది. మిగతాది కుక్కలకు పెడుతోంది. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. 

చెన్నైలోని మైలాపూర్ లాలా తోటమ్ కాలనీలో మీనా మహిళ నివాసం ఉంటోంది. 21 ఏళ్లకు పైగా ఆమె 13 కుక్కలతో నివాసం ఉంటోంది. కుక్కలకు ఎలాంటి హానీ జరుగకుండా..కాపాడుకుంటూ వస్తోంది. ఈమె పలు ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కానీ..కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించడంతో ఆమె ఇంటికే పరిమితమైంది. ముందుగానే ఊహించిన ఆమె..కొంత నిత్యావసర సరుకులు నిల్వ చేసుకుంది. తాను పనిచేస్తున్న ఇళ్ల యజమానుల నుంచి అడ్వాన్స్ ఇవ్వాలని అడగాలని అనిపించిందని, కానీ ఇది తనకు కొంత ఇబ్బంది పడ్డానని వెల్లడించింది. ఇద్దరు ఇంటి యజమానులు రెండు నెలలు జీతం ముందుగానే ఇవ్వడంతో తనకు ఎలాంటి సమస్య రాలేదన్నారు.

షిర్డీ సాయిబాబా చిత్రాలు ఆమె ఇంటిలో దర్శనమిస్తుంటాయి. కుక్కల సంరక్షణ కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. 39 ఏళ్ల వయస్సు వచ్చినా..ఇంకా పెళ్లి చేసుకోలేదు. కుక్కల మధ్య మరో వ్యక్తి రావడం ఆమెకు ఇష్టం లేదు. సంపాదించిన డబ్బును కుక్కల కోసం ఖర్చు చేస్తోంది. ఈ కుక్కలే కాకుండా..ఇంటి పరిసర ప్రాంతాల్లో సంచరించే కుక్కలకు ఆహారం అందిస్తోంది.