Small Boy Video Viral : పక్షులకు నీరు అందిస్తూ నెటిజన్ల మనసు దోచుకున్న చిన్నారి

ఎండ వేడిమి ఇంకా తగ్గట్లేదు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రత జనాలు తట్టుకోలేకపోతుంటే జంతువులు, పక్షుల సంగతి చెప్పనక్కర్లేదు. మండే ఎండలో పక్షులకు నీరు పోస్తున్న ఓ చిన్నారి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వాటిపట్ల చిన్నారి దయాగుణం చూసి అందరూ అభినందిస్తున్నారు.

Small Boy Video Viral

Video Viral : ఎండాకాలం వెళ్లిపోయినా ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు. ఎండవేడికి మనుష్యులు భరించలేకపోతున్నారు. ఇక జంతువులు, పక్షుల వంటి మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చును. మండుతున్న ఎండలో ఓ చిన్న పిల్లవాడు పక్షులకు నీరు పట్టి పోయడం అందరి మనసుల్ని కదిలించింది.

Tollywood : సినిమాల్లో హీరోలను డామినేట్ చేస్తున్న జంవుతులు, పక్షులు..

పక్షులు, జంతువుల పట్ల చిన్నపిల్లలు ఎంతో దయతో ప్రవర్తిస్తారు. ఎవరో చెప్పినట్లు ఒక్కోసారి వారు చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తాయి. పక్షులకు ఓ చిన్నారి నీళ్లు పట్టి అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Priyanka Biswas అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో చిన్న పిల్లవాడు ట్యాంక్ నుండి నీటి సీసాను నింపి పక్షుల కోసం ఉంచిన కంటైనర్లో జాగ్రత్తగా పోశాడు. వాటి పట్ల ఎంతో దయ, సానుభూతితో ఆ చిన్నారి చేసిన పని చూసే వారి మనసు దోచుకుంది. ఎంతోమందికి స్ఫూర్తి నింపింది. ఈ కలియుగంలో ఈ చిన్నారి భగవంతుడి రూపంలో వచ్చాడేమో? అనే శీర్షికతో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

3 days old baby shocking video : హాస్పిటల్ బెడ్‌పై తల ఎత్తి పాకుతున్న 3 రోజుల చిన్నారి.. షాకింగ్ వీడియో

‘ఎంతో దయ గల చిన్నారి’ అని ఒకరు.. ‘అందమైన దేవదూత’ అని మరొకరు చిన్నారిని ప్రశంసించారు. ఒక్కోసారి చిన్న పిల్లలు వారు చేసే పనులతో పెద్దవారిని ఆలోచనలో పడేస్తారు. అంతేకాదు తమ పనులతో స్ఫూర్తి నింపుతారు. ఎండలో పక్షులకు దాహం వేస్తుందని.. నీరు అవసరమని ఆ బాలుడు వాటిపట్ల కరుణ చూపడం నిజంగా గొప్ప విషయం.