Tollywood : సినిమాల్లో హీరోలను డామినేట్ చేస్తున్న జంవుతులు, పక్షులు..

ప్రస్తుతం టాలీవుడ్ వస్తున్న సినిమాలో హీరోలు కంటే జంవుతులు, పక్షులు డామినేషన్ ఎక్కువ అయ్యిపోయినట్లు కనిపిస్తుంది. హీరోలు మాదిరి మాస్ డైలాగ్స్ చెప్పకుండానే ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి.

Tollywood : సినిమాల్లో హీరోలను డామినేట్ చేస్తున్న జంవుతులు, పక్షులు..

animals and birds reference in tollywood movies

Tollywood : ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాల్లో హీరోలు కంటే జంవుతులు, పక్షులు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ప్రెజెంట్ ఫిల్మ్ మేకర్స్ అంతా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను మూగజీవాలతో ముడి పెడుతున్నారు. ఈ క్రమంలోనే పులి, ఎద్దు, కుక్క, కాకి.. మూగజీవులు అన్ని హీరోలు మాదిరి మాస్ డైలాగ్స్ చెప్పకుండానే ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. నిజానికి వీటిన్నటికంటే ముందు చాలా చిన్న మూగజీవి అయిన ఈగ అందరి మనసు దోచుకుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో ఈగ చేసిన రచ్చ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.

Ustaad Bhagat Singh : పవన్‌తో శ్రీలీల మాస్ డాన్స్ నెంబర్.. ‘పిల్ల నువ్వు లేని జీవితం’ సాంగ్ రిపీట్ చేస్తారా?

ఆ సినిమా తరువాత బాలకృష్ణ, బోయాపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో ఎద్దులను కీలకమైన ఫైట్ సీక్వెన్స్ లో చూపించి ప్రేక్షకుల చేత విజుల్స్ వేయించారు మేకర్స్. ఇక గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయిన RRR సినిమాలో పులితో ఎన్టీఆర్ పోరాడే సన్నివేశం, ఇంటర్వెల్ బ్లాక్ సీక్వెన్స్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించాయి. హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సన్నివేశాలను బాగా ఎంజాయ్ చేశారు. అలాగే అడివిశేష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 2 లో.. కుక్కని క్లైమాక్స్ సన్నివేశంలో చూపించిన విధానం కూడా ప్రేక్షకులను అలరించింది.

Tollywood : జేజమ్మ, అతిలోక సుందరి పాత్రలకు ఫస్ట్ ఛాయస్ ఆ హీరోయిన్ అంటా.. తెలుసా?

ఇక రీసెంట్ అయితే కావ్ కావ్ అని గోల చేసే కాకులు కూడా సినిమాలో మెయిన్ రోల్ ని తీసేసుకుంటున్నాయి. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన బలగం, దసరా సినిమాల్లో కాకులు ఒక ముఖ్య పాత్ర పోషించాయి అనే చెప్పాలి. దీంతో సోషల్ మీడియాలో కాకి పై సరదా మీమ్స్ కూడా వస్తున్నాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష కూడా రిలీజ్ సిద్దమవుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా కాకులు ప్రధానంగా కనిపించాయి. మరి ఈ మూవీ కాకులు ఎటువంటి రోల్ ప్లే చేశాయో చూడాలి.