Childredn Theft Money
childredn theft money: ఇంట్లో అవసరాల కోసం దాచిన డబ్బులను తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్ పిల్లలు కాజేసిన ఘటన హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివ శంకర్ అనే వ్యక్తి ఇటీవల నాలుగు లక్షల రూపాయలను ఇంట్లోని ఒక బ్యాగులో దాచాడు. ఆ సమయంలో పిల్లలు అక్కడే ఉన్నారు. అయితే, తల్లిదండ్రులు బయటకు వెళ్లగానే పిల్లలు రోజూ బ్యాగులోంచి అవసరమైన డబ్బులు తీసుకుని ఖర్చుపెట్టేవారు.
Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన
బేకరీల్లో, షాపుల్లో నచ్చినట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పిల్లలకు పక్కింట్లో ఉండే పదో తరగతి చదివే మరో ఇద్దరు పిల్లలతో పరిచయం ఏర్పడింది. ఈ పిల్లల దగ్గర డబ్బు ఉందని గమనించిన పక్కింటి పిల్లలు వాళ్ల దగ్గరి నుంచి ఎలాగైనా ఆ డబ్బు కాజేయాలనుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలకు వాచీలు, లైటర్స్, సెల్‌ఫోన్స్ వంటివి ఆశచూపి.. వాళ్ల దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టారు. ఇలా మొత్తం నాలుగు లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఇటీవల పిల్లల తల్లిదండ్రులు బ్యాగులో వెతకగా, డబ్బులు కనిపించలేదు. విషయం ఆరాతీయగా పిల్లలు తామే తీశామని చెప్పారు.
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య
అయితే, ఆ డబ్బు మొత్తం తామే ఖర్చుపెట్టుకోలేదని, పక్కింట్లో ఉండే పిల్లలకు ఇచ్చామని చెప్పారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినా, ఆ పిల్లల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.