Ladakh Standoff: భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా.. జాగ్రత్తగా బదులిస్తున్న భారత్

సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకొస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా ధీటుగా బదులిస్తూనే, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బాధ్యతతో వ్యవహరిస్తోంది.

Ladakh Standoff: సరిహద్దులో భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది చైనా. ఒకవైపు సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు చర్చలు జరుపుతూనే, మరోవైపు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్-చైనా సరిహద్దుగా పిలిచే ‘లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)’ వద్ద చైనా యుద్ధ విమానాలు భారత సరిహద్దు సమీపంలోకి దూసుకొస్తున్నాయి.

Son Murdered By Father: కొడుకును చంపి ముక్కలుగా నరికిన తండ్రి.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే

ఉత్తర లదాఖ్ ప్రాంతంవైపు చైనా విమానాలు దూసుకొస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ఘటనలు చాలా సార్లు జరిగాయి. గత మూడు, నాలుగు వారాల్లో ఇలా చైనా విమానాలు భారత్ వైపు వస్తున్నాయి. అయితే, భారత్ మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బాధ్యతతో వ్యవహరిస్తోంది. అలాగే భారత్‌కు చెందిన మిగ్-29 యుద్ధ విమానాలు, మిరేజ్ 2000 విమానాల్ని కూడా భారత్ సరిహద్దులోకి పంపిస్తోంది. నిమిషాల వ్యవధిలోనే మన విమానాలు కూడా స్పందిస్తున్నాయి. కాగా, సరిహద్దులో మన వైమానిక సామర్ధ్యాన్ని పరీక్షించేందుకే చైనా ఇలా తరచూ విమానాల్ని భారత్ వైపు పంపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కూడా సమగ్రంగా సిద్ధమవుతోంది.

Lal Darwaja Bonalu: హైదరాబాద్ బోనాల్లో ఘర్షణ.. కర్రలతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు

సరిహద్దుల్లో అవసరమైన నిర్మాణాలు చేపడుతోంది. ఏ పరిస్థితి ఎదురైనా వెంటనే ఎదుర్కొనేలా సరిహద్దుల్ని, సైన్యాన్ని అప్రమత్తం చేస్తోంది. చైనా విమానాల కవ్వింపు చర్యల అంశాన్ని ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా కూడా ప్రస్తావించారు. చైనా విమానాలు దూసుకొచ్చే దశలో ఎదుర్కొనేందుకు హై అలర్ట్‌తో ఉన్నట్లు సైనికాధికారులు తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు