Chiranjeevi Tweets: బింబిసార, సీతా రామం సక్సెస్‌లపై మెగాస్టార్ కామెంట్స్!
టాలీవుడ్‌లో రిలీజ్ అయ్యే సినిమాలకు తనదైన పద్ధతిలో విషెస్ చెబుతూ ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకున్న లేటెస్ట్ చిత్రాలు బింబిసార, సీతా రామంలపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
- Anil Aaleti
- Published On : August 6, 2022 / 12:47 PM IST
Chiranjeevi Tweets: టాలీవుడ్‌లో రిలీజ్ అయ్యే సినిమాలకు తనదైన పద్ధతిలో విషెస్ చెబుతూ ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి. తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా, తన అభిప్రాయాలతో పాటు సూచనలు, సలహాలు కూడా అభిమానులతో పంచుకుంటాడు. ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై కూడా చిరు పలుమార్లు స్పందించాడు. అయితే తాజాగా ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకున్న లేటెస్ట్ చిత్రాలు బింబిసార, సీతా రామంలపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
Chiranjeevi On Directors : టాలీవుడ్ డైరెక్టర్లపై చిరంజీవి సీరియస్… పద్దతి మార్చుకోవాలని హితవు
గతకొంత కాలంగా ప్రేక్షకులు థియేటర్స్‌కు రావట్లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఊరట, ఉత్సాహాన్ని ఇచ్చిన సినిమాలు బింబిసార, సీతా రామంలు అని చిరు పేర్కొన్నారు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ థియేటర్లకు ఖచ్చితంగా వస్తారని ప్రూవ్ చేసిన సీతా రామం, బింబిసార చిత్రాలకు.. చిత్ర నటీనటులు, నిర్మాతలకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ చిరు తన సోషల్ మీడియలో తెలిపారు.
Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు మామూలుగా ఉండదట!
ఏదేమైనా బింబిసార, సీతా రామం సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా కూడా కంటెంట్‌లో సత్తా ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేసి మిగతా సినిమాలకు దారి చూపించాయని ఇండస్ట్రీలో పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక చిరు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Hearty Congratulations
Team #SitaRamam &
Team #Bimbisara ????@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr— Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022
