Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు మామూలుగా ఉండదట!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలోనే చిరు నటిస్తున్న భోళాశంకర్ సినిమా నిర్మాత అనిల్ సుంకర ఓ ఈవెంట్‌లో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విషయాన్ని రివీల్ చేశారు.

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు మామూలుగా ఉండదట!

Producer Anil Sunkara About Chiranjeevi Bholaa Shankar Movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. తమ బాస్ మళ్లీ ఎప్పుడు బ్లాక్‌బస్టర్ కొడతాడా అని వారు ఆతృతగా చూస్తున్నారు. అయితే చిరు సినిమా అంటే మాస్ అంశాలు ఖచ్చితంగా ఉంటాయని మెగా ఫ్యాన్స్ ఆశిస్తారు. కానీ.. చిరు నటిస్తున్న నెక్ట్స్ మూవీ ‘గాడ్‌ఫాదర్’లో పొలిటికల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి. అంతేగాక ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ కూడా లేదు. దీంతో చిరు నుండి మాస్‌తో పాటు రొమాన్స్‌ను కూడా ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Chiranjeevi: మెగాస్టార్ నయా ప్లాన్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఈ క్రమంలోనే చిరు నటిస్తున్న భోళాశంకర్ సినిమా నిర్మాత అనిల్ సుంకర ఓ ఈవెంట్‌లో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విషయాన్ని రివీల్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళాశంకర్ మూవీ తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్ అయినా తెలుగు నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలిపారు. ఇక ఈ సినిమాలో కేవలం సిస్టర్ సెంటిమెంట్ మాత్రమే కాదు.. బాస్ నుండి కోరుకునే మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయని, రొమాన్స్ కూడా ఉండబోతుందని ఆయన అన్నారు.

Chiranjeevi: మెగాస్టార్ బావగా మారుతున్న యంగ్ హీరో..?

నిర్మాత ఈ విషయాలను రివీల్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక భోళాశంకర్ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తన స్వాగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను కట్టిపడేయనుండగా ఆయన సరసన అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.