Chiranjeevi: మెగాస్టార్ బావగా మారుతున్న యంగ్ హీరో..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల సమ్మర్ వెకేషన్‌కు ఫారిన్ వెళ్లిన చిరు, తిరిగి స్వదేశానికి వచ్చేశాడు....

Chiranjeevi: మెగాస్టార్ బావగా మారుతున్న యంగ్ హీరో..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల సమ్మర్ వెకేషన్‌కు ఫారిన్ వెళ్లిన చిరు, తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. ఇక రావడమే ఆలస్యం అన్నట్లుగా తన సినిమా ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇప్పటికే గాడ్‌ఫాదర్ చిత్రానికి సంబంధించి తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడట మెగాస్టార్. అయితే ఈ సినిమాతో పాటు దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాను కూడా చిరు తెరకెక్కిస్తున్నాడు.

Chiranjeevi : మెగాస్టార్.. మెగాక్రేజ్.. తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్..

ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను జూన్ 21న స్టార్ట్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా జాయిన్ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు యంగ్ హీరో నితిన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Chiranjeevi : మెగాస్టార్‌కి ఎవరు మెగా హిట్ ఇస్తారు??

భోళాశంకర్ చిత్రంలో కీర్తి సురేష్‌ను ప్రేమించి పెళ్లాడే వ్యక్తిగా నితిన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరుకు బావ పాత్రలో నితిన్ నటిస్తున్నాడనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్‌ను వదులుకోకూడదని నితిన్ ఈ సినిమాను సైన్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్’తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, రిలీజ్ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నాడు.