Justice NV Ramana: నేడు శ్రీశైలానికి సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ రాక

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ.. నేడు కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి రానున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని..

Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ.. నేడు కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి రానున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన శ్రీశైలం చేరుకోనుండగా.. సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సీజేఐ రాక నేపథ్యంలో ఏపీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Chief Justice NV Ramana : హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ భవనం.. భూమిపూజ చేసిన చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ

కాగా, గత ఏడాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఆయన అప్పటి నుండి తరచుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ.. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం కూడా సీజేఐ రమణ తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు.

CJI Justice NV Ramana : వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఆయన తాజాగా హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. శనివారం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జస్టిస్ ఎన్.వి రమణ.. ఐఏఎంసీ (అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్) ట్రస్ట్ కు రూపకల్పన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఇలా అదే ట్రస్ట్ కోసం శాశ్వత భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయటంపై సంతోషం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు