CJI Justice NV Ramana : వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ మంత్రులు, స్వాములవారిని దర్శించుకున్నారు.

10TV Telugu News

CJI Justice NV Ramana visited Thirumala Srivaru : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12గంటల 5నిమిషాలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలతో పాటు, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 1.45గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ మంత్రులు, పలువురు ప్రముఖులు కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. నేరుగా తిరుమలకు వచ్చిన ప్రముఖులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తుండగా.. సిఫారసు లేఖలు నిలిపివేశారు.

Corona : 1700 మంది పోలీసులకు కరోనా

ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు. ద్వాదశి సందర్భంగా రేపు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. ఆలయంతో పాటు వైకుంఠ ద్వారాన్ని నాలుగు టన్నుల పూలతో సుందరంగా అలంకరించారు.

ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం, వర్చువల్‌ అర్జిత సేవా టికెట్ల దర్శనం ఇలా రోజుకు 45వేల మంది శ్రీవారిని దర్శించుకోనున్నారు. వైకుంఠ ద్వార చేసుకునేందుకు ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు.

×