Wooden Bridge
Wooden Bridge: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ వర్షాల ధాటికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి అక్కడి మనాలిలోని సెరి నాలా ప్రాంతంలో భారీ వరద ముంచెత్తింది. ఇక్కడ సోలాంగ్-మనాలిని కలుపుతూ బీస్ నదిపై నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఇది కలపతో నిర్మించిన బ్రిడ్జి. వరద ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
AP Villages: తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆగదు: ఏపీ విలీన గ్రామాల ప్రజలు
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ప్రజలెవరూ ఇళ్లు దాటి బయటకు రావొద్దని సూచించారు. బీస్ నదివైపు ప్రజలెవరూ రావొద్దని సూచించారు. చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇక్కడి బీస్ నది ప్రమాదకర స్థాయిలో పొంగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.