CM KCR pensions
CM KCR pensions : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం(ఆగస్టు6,2022) ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
Telangana Government : తెలంగాణలో వృద్ధ్యాప్య పెన్షన్లపై కొత్త జీవో జారీ
దీంతో రాష్ట్రంలో మొత్తం పెన్షనర్ల సంఖ్య 46లక్షలకు చేరుకుంటుందన్నారు. 57 సంవత్సరాల వయస్సు కల్గిన వారికి పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు సైతం పెన్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డయాలసిస్ పేషెంట్లకు రూ.2016 పెన్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.