Telangana Government : తెలంగాణలో వృద్ధ్యాప్య పెన్షన్లపై కొత్త జీవో జారీ

వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్‌ను 57 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ సర్కార్‌ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు ఓల్డేజ్ పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా.. దానిని ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది.

Telangana Government : తెలంగాణలో వృద్ధ్యాప్య పెన్షన్లపై కొత్త జీవో జారీ

Telangana Government

Updated On : August 5, 2021 / 8:14 AM IST

old age pensions : వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్‌ను 57 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ సర్కార్‌ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు ఓల్డేజ్ పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా.. దానిని ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్ ను తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

దీనికి సంబంధించి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓల్డేజ్ పింఛన్ల అర్హత వయసు తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6లక్షల 62వేల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకుంది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.