Adhir Ranjan
‘Rashtrapatni’ Remark: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ ఇవాళ లేఖ రాశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అంటూ అధిర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆ సమయంలోనే క్షమాపణలు తెలిపారు. పొరపాటున నోరు జారానని అన్నారు. అయితే, ఆయన ఉద్దేశపూర్వకంగానే రెండు సార్లు రాష్ట్రపత్ని అన్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతూ ఆయన ఇప్పుడు లేఖ రాశారు.
”మీ హోదాను పేర్కొంటోన్న సమయంలో పొరపాటున తప్పుడు పదాన్ని వాడాను. దీనికి చింతిస్తూ ఈ లేఖ రాస్తున్నాను. కేవలం నోరు జారి మాత్రమే ఆ సమయంలో ఆ పదం వాడాను. మీకు క్షమాపణలు చెబుతున్నాను. నా క్షమాపణను మీరు అంగీకరించాలని నేను కోరుతున్నాను” అని అధిర్ రంజన్ చౌదరీ ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా, దేశ ప్రథమ పౌరురాలిని అగౌరపర్చేలా అధిర్ రంజన్ చౌదరీ వ్యాఖ్యలు చేశారని బీజేపీ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. పొరబాటుగా నోరు జారాననని ఇప్పటికే ట్విటర్‌లో వీడియో కూడా విడుదల చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యపై పార్లమెంట్‌లోనూ గందరగోళం నెలకొంది. తాను చేసిన వ్యాఖ్యను రాష్ట్రపతి అవమానకరంగా భావిస్తే తాను స్వయంగా ఆమె వద్దకు వెళ్లి క్షమాపణలు చెబుతానని కూడా అధిర్ రంజన్ చౌదరి చెప్పారు.
Rohit Sharma: నెట్స్‌లో రోహిత్ శర్మ ప్రాక్టీస్.. వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ