Rohit Sharma: నెట్స్‌లో రోహిత్ శ‌ర్మ‌ ప్రాక్టీస్.. వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నెట్స్‌లో సాధ‌న చేస్తూ బిజీబిజీగా క‌న‌ప‌డ్డాడు. భార‌త్-వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడ‌లేద‌న్న విష‌యం తెలిసిందే. వ‌న్డే సిరీస్‌కు కెప్టెన్‌గా శిఖ‌ర్ ధావ‌న్ బాధ్య‌త‌లు నిర్వ‌హించాడు. కొన్ని రోజులుగా రోహిత్ శ‌ర్మ‌ ఆట‌కు దూరంగా ఉంటున్నాడు. భార‌త్-వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య నేటి నుంచి ప్రారంభ‌మ‌య్యే ఐదు మ్యాచుల‌ టీ20 స‌రీస్‌లో తిరిగి ఆడుతున్నాడు. దీంతో రోహిత్ శ‌ర్మ‌ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ప‌లు ర‌కాల షాట్లు ఆడుతూ నెట్స్‌లో రోహిత్ హుషారుగా క‌న‌ప‌డ్డాడు.

Rohit Sharma: నెట్స్‌లో రోహిత్ శ‌ర్మ‌ ప్రాక్టీస్.. వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ

Rohit

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నెట్స్‌లో సాధ‌న చేస్తూ బిజీబిజీగా క‌న‌ప‌డ్డాడు. భార‌త్-వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడ‌లేద‌న్న విష‌యం తెలిసిందే. వ‌న్డే సిరీస్‌కు కెప్టెన్‌గా శిఖ‌ర్ ధావ‌న్ బాధ్య‌త‌లు నిర్వ‌హించాడు. కొన్ని రోజులుగా రోహిత్ శ‌ర్మ‌ ఆట‌కు దూరంగా ఉంటున్నాడు. భార‌త్-వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య నేటి నుంచి ప్రారంభ‌మ‌య్యే ఐదు మ్యాచుల‌ టీ20 స‌రీస్‌లో తిరిగి ఆడుతున్నాడు. దీంతో రోహిత్ శ‌ర్మ‌ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప‌లు ర‌కాల షాట్లు ఆడుతూ నెట్స్‌లో రోహిత్ హుషారుగా క‌న‌ప‌డ్డాడు. కాగా, భార‌త్-వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య కాసేప‌ట్లో తొలి టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నుంచి వికెట్ కీప‌ర్‌ కేఎల్ రాహుల్‌ను త‌ప్పించి సంజూ శాంసన్‌ను తీసుకున్నారు. ఇటీవ‌ల వెస్టిండీస్‌పై మూడు వ‌న్డేల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో గెలుచుకున్న విష‌యం తెలిసిందే. టీమిండియా స్వాడ్‌లో రోహిత్ శ‌ర్మ, ఇషాంత్ కిష‌న్, సంజూ శాంస‌న్, సూర్య‌కుమార్ యాద‌వ్, దీప‌క్ హూడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిష‌బ్ పంత్, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, అక్స‌ర్ ప‌టేల్, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీ బిష్ణోయి, కుల్దీప్ యాద‌వ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, అన్వేశ్ ఖాన్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, అర్ష‌దీప్ సింగ్ ఉన్నారు.

India vs West Indies: టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్‌