Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను రేవంత్ ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటానని చెప్పారు. పాత కాంగ్రెస్ వాళ్లను పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని విమర్శించారు. తనను కూడా వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Komatireddy Venkat Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను రేవంత్ ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటానని చెప్పారు. పాత కాంగ్రెస్ వాళ్లను పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని విమర్శించారు. తనను కూడా వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ లోనే పుట్టాను..కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా కాంగ్రెస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు. తనకు కూడా చీమూ నెత్తురు ఉందన్నారు.

పార్టీ ముఖ్యమే.. అంతిమంగా ప్రజలు ముఖ్యం అని అన్నారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని.. తాను స్టార్ క్యాంపెయినర్ అని..తనకు తెలియకుండానే పార్టీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మొన్న వచ్చిన వారికి పీసీపీ ఇస్తారా? అని నిలదీశారు. పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ ఎందుకు బయటికి వెళ్తున్నారో గమనించాలన్నారు. అందరినీ వెళ్లగొట్టి టీడీపీ వాళ్లను కాంగ్రెస్ లోకి తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. తనను అడగకుండానే తన నియోజకవర్గంలో సభ పెట్టారని అసహనం వ్యక్తం చేశారు.

Dasoju Shravan : కాంగ్రెస్ కు మరో కీలక నేత గుడ్ బై?

తనకు పడని వారిని పార్టీలో చేర్చుకున్నారని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తన వ్యతిరేకులు ఉన్న సభకు తాను ఎలా హాజరవుతానని చెప్పారు. తన పార్లమెంట్ స్థానంలో సభ ఏర్పాటు చేసినప్పుడు తనకు చెప్పాలా? వద్దా? అని అడిగారు. తనకు తెలియకుండానే చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంటే ఆరు నెలలు రేవంత్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. ఏదైనా చేస్తే అందరికీ చెప్పే చేస్తానని చెప్పారు. తాను బీజేపీలోకి వెళ్తే చెప్పే వెళ్తానని పేర్కొన్నారు. తాను దేనికీ భయపడను..ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమైన సమావేశాలున్నాయి కాబట్టే ఢిల్లీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి కోసం కలిస్తే రాజకీయం చేయొద్దని హితవు పలికారు.

ట్రెండింగ్ వార్తలు