Dasoju Shravan : కాంగ్రెస్ కు మరో కీలక నేత గుడ్ బై?
తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌కు మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Congress dasoju Shravan resign
Dasoju Shravan : తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌కు మరో కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు గంటలకు దాసోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఖైరతాబాద్ చేరికలపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా దాసోజు శ్రవణ్ ఉన్నారు.
మరోవైపు ఇంతకాలం కాంగ్రెస్‌లో సాగిన కోల్డ్ వార్…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత….మాటలయుద్ధంలోకి మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటిస్తూ..దానికి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాజగోపాల్‌రెడ్డికి బదులిచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి కోమటరెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారమే రేపాయి. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన కోరినట్టుగా రేవంత్ క్షమాపణ చెప్పకపోయిన్పటికీ..కాస్త మెత్తబడినట్టు కనిపించారు.
Munugodu BY-Election : మునుగోడు ఉప ఎన్నికల బరిలో..ఏ పార్టీ నుంచి ఎవరు?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ వాడని రేవంత్ అన్నారు. మునుగోడులో ప్రచారానికి సైతం వెంకటరెడ్డి వస్తారని చెప్పారు. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసి గంటైనా గడవకముందే ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు వెంకటరెడ్డి. ఇక నుంచి రేవంత్ రెడ్డి ముఖమే చూడనన్నారు. చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై మండిపడ్డారు. తనను ఓడించడానికి ప్రయత్నించిన వ్యక్తిని కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారని నిలదీశారు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే మునుగోడు వెళ్తానన్నారు. రేవంత్ రెడ్డిపై కోపాన్ని మీడియాపై చూపించారు. చండూరు సభకు వెళ్తారా అని ప్రశ్నించిన మీడియాతో మీరు స్పెషల్ ఫైట్ ఎరేంజ్ చేస్తే వెళ్లానంటూ సెటైర్ వేశారు.
ఆపరేషన్ ఆకర్ష్‌ను బీజేపీ మరింత ఉధృతం చేసింది. ఇప్పటికే చేరికల కమిటీని ఏర్పాటు చేసి కసరత్తు మొదలుపెట్టింది. ఢిల్లీకి ఓ లిస్ట్‌ను కూడా పంపించింది. హైకమాండ్ నుంచి ఆమోదం రాగానే.. చేరికలు మొదలయ్యే అవకాశం ఉంది. ఏకంగా 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బండి సంజయ్ ప్రకటించి కలకలం రేపారు.