presidential election: రేపు మ‌మ‌తా బెన‌ర్జీ నిర్వ‌హించే భేటీలో పాల్గొన‌నున్న కాంగ్రెస్‌

రాష్ట్రపతి ఎన్నికకు జూన్29న నోటిఫికేషన్ విడుదలై, జూలై 18న పోలింగ్ జ‌రగనున్న నేపథ్యంలో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రేపు నిర్వ‌హించ‌నున్న స‌మావేశానికి కాంగ్రెస్ పార్టీ నేత‌లు హాజ‌రుకానున్నారు.

presidential elections: రాష్ట్రపతి ఎన్నికకు జూన్29న నోటిఫికేషన్ విడుదలై, జూలై 18న పోలింగ్ జ‌రగనున్న నేపథ్యంలో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రేపు నిర్వ‌హించ‌నున్న స‌మావేశానికి కాంగ్రెస్ పార్టీ నేత‌లు హాజ‌రుకానున్నారు. ఎన్డీఏకి దీటుగా విప‌క్ష పార్టీల నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వ‌హించ‌నున్న‌ ఈ స‌మావేశంలో కాంగ్రెస్‌ నుంచి మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జైరాం ర‌మేశ్, ర‌ణ్‌దీప్ సుర్జేవాలా పాల్గొంటార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

presidential elections: విపక్షాల మధ్య లోపిస్తున్న ఐక్యత.. రేపటి భేటీకి దూరంగా సీఎంలు

కాగా, ఈ స‌మావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా 22 మంది విప‌క్ష పార్టీల‌ నేతలకు మమతా బెనర్జీ లేఖలు రాశారు. రాష్ట్రపతి ఎన్నికపై చ‌ర్చించేందుకు రావాల‌ని కోరారు. అయితే, ఈ స‌మావేశానికి వ‌చ్చేందుకు విపక్ష పార్టీల సీఎంలు సుముఖంగా లేన‌ట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభ‌మ‌య్యే ఈ స‌మావేశానికి విప‌క్ష‌ పార్టీల ప్ర‌తినిధులు పాల్గొనే అవ‌కాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు