presidential elections: విపక్షాల మధ్య లోపిస్తున్న ఐక్యత.. రేపటి భేటీకి దూరంగా సీఎంలు

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకి దీటుగా విప‌క్ష పార్టీల నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న వేళ‌ ఆమెకు ఈ విష‌యంలో ఎదురుదెబ్బ త‌గిలేలా ఉంది.

presidential elections: విపక్షాల మధ్య లోపిస్తున్న ఐక్యత.. రేపటి భేటీకి దూరంగా సీఎంలు

Mamata Benerjee

presidential elections: రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకి దీటుగా విప‌క్ష పార్టీల నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న వేళ‌ ఆమెకు ఈ విష‌యంలో ఎదురుదెబ్బ త‌గిలేలా ఉంది. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా 22 మంది విప‌క్ష పార్టీల‌ నేతలకు మమతా బెనర్జీ లేఖలు రాసిన విష‌యం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికపై చ‌ర్చించేందుకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో స‌మావేశానికి రావాల‌ని వారంద‌రినీ మ‌మ‌త ఆహ్వానించారు. అయితే, రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల మధ్య ఐక్యత లోపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

congress: ఏ నేరంపై విచార‌ణ జ‌రుపుతున్నార‌ని అడిగితే స‌మాధానం లేదు: చిదంబ‌రం
రేపటి మమత బెనర్జీ సమావేశానికి దూరంగా విపక్ష పార్టీల సీఎంలు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చిద్దామ‌ని మ‌మ‌త అన్నారు. అయితే, రేపు జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే, ఝార్ఖండ్ ఈఎం హేమంత్ సొరేన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా కీలక నేతల హాజరుపై సందిగ్ధత నెల‌కొంది.

congress: రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు.. టీఆర్ఎస్, వైసీపీతోనూ చర్చలు!
మమతాబెనర్జీ నేతృత్వంలో జరిగే విపక్ష పార్టీల సమావేశానికి మెజారిటీ నేతలు వారివారి పార్టీల ఎంపీలు, పార్లమెంటరీ పక్ష నేతలను పంపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మమతా బెనర్జీ ఆహ్వానం పంప‌లేదు. ఈ నేప‌థ్యంలో ఈ సమావేశానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అంతేకాదు, మమతా బెనర్జీ నిర్వ‌హిస్తున్న ఈ సమావేశానికి దూరంగా ఉండాలని పలు వామపక్ష నేతలు కూడా భావిస్తున్నారు.

prophet row: విచార‌ణ‌కు రావ‌డానికి స‌మ‌యం ఇవ్వండి: నుపుర్ శ‌ర్మ‌

విపక్షాల తరఫున‌ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఆయా పార్టీల‌తో చ‌ర్చించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ త‌మ పార్టీ నేత‌ మల్లికార్జున ఖర్గేను నియమించింది. మ‌రోవైపు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ సైతం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 18న ఎన్నిక జ‌రుగుతుంది.