prophet row: విచార‌ణ‌కు రావ‌డానికి స‌మ‌యం ఇవ్వండి: నుపుర్ శ‌ర్మ‌

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై తాను చేసిన అనుచిత వ్యాఖ్య‌ల కేసులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని నుపుర్ శ‌ర్మ కోరారు. ఆమె బీజేపీ నుంచి స‌స్పెన్ష‌న్ వేటు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే.

prophet row: విచార‌ణ‌కు రావ‌డానికి స‌మ‌యం ఇవ్వండి: నుపుర్ శ‌ర్మ‌

Nurup Sharma

prophet row: మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై తాను చేసిన అనుచిత వ్యాఖ్య‌ల కేసులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని నుపుర్ శ‌ర్మ‌ కోరారు. ఆమె బీజేపీ నుంచి స‌స్పెన్ష‌న్ వేటు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై ఆమె కొన్ని రోజుల క్రితం అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో మ‌హారాష్ట్రలోని థానె జిల్లా భివండీ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. దీంతో సోమ‌వారం విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని, ఆమె ఇచ్చే వివ‌ర‌ణ‌కు రికార్డు చేస్తామ‌ని పేర్కొంటూ పోలీసులు ఇటీవ‌ల స‌మ‌న్లు పంపారు.

National Herald case: విచార‌ణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ.. ఈ ప్ర‌శ్న‌లు అడిగిన ఈడీ

అయితే, తాను నేడు రాలేన‌ని నుపుర్ శ‌ర్మ‌ చెప్ప‌డంతో ఆమె చేసిన విజ్ఞ‌ప్తిని అంగీక‌రించామ‌ని పోలీసులు తెలిపారు. విచార‌ణ‌కు హాజ‌రయ్యేందుకు ఆమెకు ఎంత స‌మ‌యం ఇచ్చామ‌న్న విష‌యాన్ని అధికారులు వివ‌రించ‌లేదు. కాగా, మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నురూప్ శ‌ర్మ ఓ టీవీ చ‌ర్చ‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ర‌జా ఆకాడ‌మీకి చెందిన ఓ ప్ర‌తినిధి మే 30న ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశామ‌ని భివండి పోలీసులు వివ‌రించారు. అలాగే, మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై సామాజిక మాధ్య‌మాల్లో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన న‌వీన్ జిందాల్‌పై కూడా కేసు న‌మోద‌యింద‌ని చెప్పారు. ఆయ‌న ఈ నెల 15న విచార‌ణ‌కు రావాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు.