National Herald case: విచార‌ణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ.. ఈ ప్ర‌శ్న‌లు అడిగిన ఈడీ

కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కార్యాల‌యంలో విచార‌ణ ఎదుర్కొంటున్నారు. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్-50 కింద నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ వివ‌ర‌ణ‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

National Herald case: విచార‌ణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ.. ఈ ప్ర‌శ్న‌లు అడిగిన ఈడీ

Rahul Gandhi

National Herald case: కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కార్యాల‌యంలో విచార‌ణ ఎదుర్కొంటున్నారు. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్-50 కింద నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ వివ‌ర‌ణ‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులను కూడా ఈడీ కార్యాలయంలోకి అనుమతించడం లేదని కాంగ్రెస్‌ నేతలు ఈడీ కార్యాల‌యం వ‌ద్ద‌ ఆందోళనకు దిగారు. ఈడీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

National Herald case: రాహుల్ అన్ని ఆరోప‌ణ‌ల నుంచి బయ‌ట‌ప‌డ‌తారు: రాబ‌ర్ట్ వాద్రా

రాహుల్ గాంధీతో పాటు కేవలం ప్రియాంక గాంధీని మాత్రమే ఈడీ కార్యాలయంలోకి అధికారులు అనుమతించారు. ”అసోసియేట్ జనరల్ సంస్థలో మీ హోదా ఏంటి? యంగ్ ఇండియన్ సంస్థతో మీకు ఉన్న సంబంధం ఏంటి? మీ పేరుతో ఆ సంస్థ‌లో షేర్లు ఎందుకు ఉన్నాయి? యంగ్ ఇండియన్ సంస్థకు కాంగ్రెస్ పార్టీ నుంచి రుణాలు ఎందుకు ఇచ్చారు?” వంటి ప్ర‌శ్న‌ల‌ను రాహుల్ గాంధీని ఈడీ అధికారులు అడిగారు. కాగా, అంత‌కుముందు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి ఈడీ కార్యాల‌యానికి రాహుల్ గాంధీ బ‌య‌లుదేరుతుండ‌గా ఆయ‌నను వంద‌లాది మంది పార్టీ నేత‌లు, కార్యక‌ర్త‌లు చుట్టుముట్టారు. ఆయ‌న‌కు సంఘీభావంగా వారు త‌ర‌లివ‌చ్చారు. అయితే, పోలీసులు ర్యాలీకి అనుమ‌తి నిరాక‌రించారు.