National Herald case: రాహుల్ అన్ని ఆరోప‌ణ‌ల నుంచి బయ‌ట‌ప‌డ‌తారు: రాబ‌ర్ట్ వాద్రా

కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీపై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ప్రియాంకా గాంధీ భ‌ర్త‌, వ్యాపార‌వేత్త రాబ‌ర్ట్ వాద్రా అన్నారు. రాహుల్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ ఎదుర్కోనున్న నేప‌థ్యంలో రాబ‌ర్ట్ వాద్రా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.

National Herald case: రాహుల్ అన్ని ఆరోప‌ణ‌ల నుంచి బయ‌ట‌ప‌డ‌తారు: రాబ‌ర్ట్ వాద్రా

National Herald case: కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీపై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ప్రియాంకా గాంధీ భ‌ర్త‌, వ్యాపార‌వేత్త రాబ‌ర్ట్ వాద్రా అన్నారు. రాహుల్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ ఎదుర్కోనున్న నేప‌థ్యంలో రాబ‌ర్ట్ వాద్రా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. రాహుల్‌పై మోపుతోన్న అన్ని నిరాధార ఆరోప‌ణ‌ల నుంచి ఆయ‌న విముక్తి పొందుతున్నార‌ని రాబ‌ర్ట్ వాద్రా చెప్పారు. త‌న‌కు కూడా గ‌తంలో ఈడీ 15 సార్లు స‌మ‌న్లు పంపి, విచారించింద‌ని ఆయ‌న అన్నారు. తాను సంపాదించిన తొలి రూపాయి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సంపాదించిన డ‌బ్బు గురించి వివ‌ర‌ణ ఇచ్చాన‌ని తెలిపారు.

National Herald case: రాహుల్‌ను క‌లిసిన ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు

ఇటువంటి వేధింపుల‌తో దేశ ప్ర‌జ‌ల‌ను కేంద్ర స‌ర్కారు అణ‌చివేయ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. ఎప్ప‌టికీ స‌త్య‌మే గెలుస్తుంద‌ని హిత‌వు ప‌లికారు. వేధింపుల‌కు గురిచేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఏది సాధించాల‌ని అనుకుంటుందో దాన్ని ఎప్ప‌టికీ సాధించ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇటువంటి వేధింపులు ప్ర‌జ‌ల గ‌ళాన్ని మ‌రింత బల‌ప‌ర్చుతాయ‌ని అన్నారు. త‌మకు మ‌ద్ద‌తు తెలుపుతున్న ప్ర‌జ‌ల త‌ర‌ఫున, సత్యం కోసం పోరడానికే తాము ఉన్నామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.