National Herald case: రాహుల్‌ను క‌లిసిన ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాసేప‌ట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కార్యాల‌యానికి బ‌య‌లుదేర‌నున్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ వార్తాప‌త్రిక‌కు సంబంధించిన న‌గదు అక్ర‌మ బదిలీ కేసులో ఆయ‌న విచార‌ణ ఎదుర్కోనున్నారు.

National Herald case: రాహుల్‌ను క‌లిసిన ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు

National Herald case:  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాసేప‌ట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కార్యాల‌యానికి బ‌య‌లుదేర‌నున్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ వార్తాప‌త్రిక‌కు సంబంధించిన న‌గదు అక్ర‌మ బదిలీ కేసులో ఆయ‌న విచార‌ణ ఎదుర్కోనున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఢిల్లీకి వెళ్లి రాహుల్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. రాహుల్ ఇంటికి కాంగ్రెస్ నాయ‌కురాలు, ఆయ‌న సోద‌రి ప్రియాంకా గాంధీ కూడా వెళ్లారు. ఆయ‌న‌తో కాసేపు మాట్లాడారు.

Prophet Row: యూపీ సీఎం.. అలహాబాద్ న్యాయమూర్తి అయ్యారా – ఒవైసీ

ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్దకు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు చేరుకున్నారు. అక్క‌డ ”రాహుల్ గాంధీ జిందాబాద్” అనే పాట‌ను కాంగ్రెస్ వినిపిస్తోంది. దేశంలోని ప‌లు ప్రాంతాల నుంచి త‌మ పార్టీ నేత‌లు ఇక్క‌డ‌కు వ‌చ్చార‌ని, త‌మ పార్టీ అధిష్ఠానానికి సంఘీభావం తెలుపుతున్నామ‌ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబ‌రం అన్నారు. ఈడీని కేంద్ర ప్ర‌భుత్వం ఎలా దుర్వినియోగం చేస్తుందో దేశ ప్ర‌జ‌ల‌కు చెబుతామ‌ని ఆయ‌న తెలిపారు. ఈడీ పెట్టిన అన్ని కేసులూ బోగస్ అని ఆయ‌న ఆరోపించారు. తాను కూడా గ‌తంలో చాలాసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్నాన‌ని తెలిపారు. ఈడీ వ్య‌వ‌హ‌రించే తీరు ఎలా ఉంటుందో చెప్ప‌డంలో తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ నిష్ణాతుడిన‌ని చుర‌క‌లంటించారు.

prophet row: ప్ర‌ధాని మోదీ మౌనం వీడాలి: శ‌శి థ‌రూర్

తాము ఈడీ కార్యాల‌యం వ‌ర‌కు రాహుల్ వెంట ర్యాలీగా వెళ్తామ‌ని కాంగ్రెస్ నేత ర‌ణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు. తాము రాజ్యాంగ ప‌రిర‌క్ష‌కుల‌మ‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌ను భ‌య‌పెట్టాల‌ని చూసినా వెన‌క్కి త‌గ్గ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. స్వాతంత్ర్య పోరాట స‌మ‌యంలోనూ బ్రిటిష్ వారు కాంగ్రెస్ గొంతును అణ‌చివేయ‌లేక‌పోయార‌ని ఆయ‌న అన్నారు. తాము శాంతియుతంగా ర్యాలీలో పాల్గొంటామంటే అందులో త‌ప్పేం ఉంటుంద‌ని రాజ‌స్థాన్ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గ‌హ్లోత్ ప్ర‌శ్నించారు.