prophet row: ప్ర‌ధాని మోదీ మౌనం వీడాలి: శ‌శి థ‌రూర్

దేశంలో పెరుగుతున్న‌ ద్వేష‌పూరిత ప్ర‌సంగాలు, ఇస్లామోఫోబియా ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌ధాని మోదీ త‌న మౌనాన్ని వీడాల్సిన అవ‌స‌రం వ‌చ్చిందంటూ కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో వారిపై బీజేపీ పార్టీప‌రంగా చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే.

prophet row: ప్ర‌ధాని మోదీ మౌనం వీడాలి: శ‌శి థ‌రూర్

Congress president election

prophet row: దేశంలో పెరుగుతున్న‌ ద్వేష‌పూరిత ప్ర‌సంగాలు, ఇస్లామోఫోబియా ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌ధాని మోదీ త‌న మౌనాన్ని వీడాల్సిన అవ‌స‌రం వ‌చ్చిందంటూ కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో వారిపై బీజేపీ పార్టీప‌రంగా చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే, వారిద్ద‌రు చేసిన వ్యాఖ్య‌ల‌పై దేశంలోనే కాకుండా ముస్లిం మెజారిటీ దేశాల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

prophet row: ప్ర‌ధాని మోదీ వెంట‌నే స్పందిస్తే బాగుండేది: చిదంబ‌రం

దీనిపై శ‌శి థ‌రూర్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ఇటీవ‌లి కాలంలో ముస్లిం దేశాల‌తో స‌త్సంబంధాల బ‌లోపేతం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో కృషి చేస్తోంద‌ని చెప్పారు. ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ వృథా అవుతున్నాయ‌ని విమ‌ర్శించారు. భార‌త్‌లో ముస్లింల‌పై వివ‌క్షాపూరిత ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయంటూ ఆయా దేశాల్లోని మీడియా సంస్థ‌లు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నాయ‌ని అన్నారు. భార‌త్‌లో దైవ‌దూష‌ణ నిరోధ‌క చ‌ట్టాలు తీసుకురావాలంటూ జ‌రుగుతోన్న చ‌ర్చ‌పై కూడా ఆయ‌న స్పందించారు. అటువంటి చ‌ట్టాలకు తానేం అభిమానిని కాద‌ని చెప్పారు. ఎందుకంటే ప‌లు దేశాల్లో ఉన్న అటువంటి చ‌ట్టాల‌ను దుర్వినియోగం చేసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయ‌ని గుర్తు చేశారు. ఇప్ప‌టికే మ‌న వ‌ద్ద ఉన్న‌ విద్వేష‌పూరిత ప్ర‌సంగాల నిరోధ‌క చ‌ట్టాలు, సెక్ష‌న్ 295 స‌రిపోతాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.