prophet row: ప్రధాని మోదీ వెంటనే స్పందిస్తే బాగుండేది: చిదంబరం
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చెలరేగిన వివాదంపై ప్రధాని మోదీ వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఈ విషయంపై మోదీ జోక్యం చేసుకోకుండా, మౌనం వహించడం సరికాదని ఆయన చెప్పారు.

prophet row: మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చెలరేగిన వివాదంపై ప్రధాని మోదీ వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఈ విషయంపై మోదీ జోక్యం చేసుకోకుండా, మౌనం వహించడం సరికాదని ఆయన చెప్పారు. ఇస్లామోఫోబియా గురించి దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ నాయకులు, రచయితలు, స్కాలర్లు, సామాన్యులు ప్రభుత్వాన్ని ముందస్తుగానే హెచ్చరించారని ఆయన అన్నారు. దానికి ముగింపు పలకాలని కోరారని చెప్పారు.
అయితే, ప్రభుత్వం పట్టించుకోలేదని చిదంబరం అన్నారు. ఇప్పుడు 16 దేశాలు దీనిపై నిలదీస్తే కేంద్ర ప్రభుత్వం మేల్కొందని చెప్పారు. దేశంలో ఇస్లామోఫోబియా లేకుండా చేయాలంటూ భారతీయ ముస్లింలు విదేశాల వంక చూడాలా అని ఆయన ప్రశ్నించారు. లౌకికవాదాన్ని కొనసాగించడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని ఆయన విమర్శించారు. నురూప్ శర్మకు మద్దతుగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలు చేసినట్లు తాను వార్తల్లో చదివానని ఆయన అన్నారు.
prophet row: వివాదంపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన బీజేపీ బెంగాల్ నేత అరెస్టు
అలాగే, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా మౌనం వహిస్తుండడం, బీజేపీలోని మరికొందరు నురూప్ శర్మ, నవీన్ జిందాల్‌కు మద్దతుగా వ్యవహరిస్తుండడం, 16 దేశాల్లో నిరసనలు తెలుపుతుండడం వల్ల బీజేపీ వైఖరి ఎటువంటిదో స్పష్టమవుతుందని చిదంబరం చెప్పారు. మైనారిటీలకు భరోసా ఇచ్చి, శాంతిని పునరుద్ధరించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా భారత్ లౌకిక దేశం అన్న విధానానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.