prophet row: వివాదంపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన బీజేపీ బెంగాల్ నేత అరెస్టు

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌ల అనంత‌రం చోటు చేసుకుంటోన్న‌ ప‌రిణామాల‌పై పోలీసులు దృష్టి పెట్టారు. శుక్ర‌వారం నుంచి దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో సామాజిక మాధ్య‌మాల్లో రెచ్చ‌గొట్టేలా పోస్టులు చేస్తోన్న వారిని అరెస్టు చేస్తున్నారు.

prophet row: వివాదంపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన బీజేపీ బెంగాల్ నేత అరెస్టు

Arrested

prophet row: మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌ల అనంత‌రం చోటు చేసుకుంటోన్న‌ ప‌రిణామాల‌పై పోలీసులు దృష్టి పెట్టారు. శుక్ర‌వారం నుంచి దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో సామాజిక మాధ్య‌మాల్లో రెచ్చ‌గొట్టేలా పోస్టులు చేస్తోన్న వారిని అరెస్టు చేస్తున్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని ప‌లు ప్రాంతాల్లోనూ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పోలీసులు మ‌రోసారి అటువంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

China: శాయ‌శ‌క్తులా పోరాడ‌తాం: అమెరికాకు చైనా వార్నింగ్‌

ప‌శ్చిమ మెదినీపూర్‌లోని బెల్దా ప్రాంతాన‌కి చెందిన‌ బీజేపీ నేత చంద‌న్ జనా తాజాగా ఈ వివాదంపై అభ్యంత‌ర‌క‌ర‌ పోస్టు చేయ‌డంతో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రోవైపు, హింస చెల‌రేగిన హౌరాలో బీజేపీ నేత సువేందు అధికారి ప‌ర్య‌టించ‌కుండా ప‌శ్చిమ బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారు. కాగా, అసోంలోని క‌చ‌ర్ జిల్లాలో నురూప్ శ‌ర్మ దిష్టిబొమ్మ‌ల‌ను నిర‌స‌న‌కారులు త‌గుల‌బెట్టారు. ఆమెను అరెస్టు చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.