Edible Oil Price: గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు.. ఎంతంటే?

దేశంలో వంట నూనెల ధరలు మరోసారి తగ్గుముఖం పెట్టనున్నాయి. లీటరుపై రూ. 10 నుంచి రూ. 12 వరకు తగ్గుతాయని, తగ్గిన ధరలు మరో వారం రెండు వారాల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

Edible Oil Price: వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో రికార్డు స్థాయికి చేరడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. కరోనా ఎఫెక్ట్, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి కారణాలతో వంటనూనెల దిగుమతి తగ్గి ధరలు పెరిగాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అంతర్జాతీయ పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా వంట నూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లీటర్ పై రూ. 10 నుంచి 12 వరకు తగ్గే అవకాశం ఉంది.

Cooking Oil Price : వంటనూనెల ధరలను తగ్గించండి-కేంద్రం ఆదేశం

ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతి దారుగా ఉన్న భారత్ తన దేశీయ అవసరాలకు మలేషియా, ఇండోనేషియాపై ఆదారపడుతోంది. ఏటా 13.5 మిలియన్ టన్నుల వంటనూనెను దేశం దిగుమతి చేసుకుంటుంది. యేటా ఇండోనేషియా నుంచి 4 మిలియన్ టన్నుల మేర పామాయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఏప్రిల్ నెలలో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో భారత్ లోనూ ధరలు పెరిగాయి. అయితే మే 23 నుంచి మళ్లీ ఇండోనేషియా ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ల భిస్తుండటంతో ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో భారత్ లోనూ వంట నూనెల ధరలు తగ్గే అవకాశంఉన్నట్లు తెలుస్తోంది.

Edible Oil Prices: వంట నూనెల ధరలు తగ్గించండి.. కంపెనీలకు కేంద్రం ఆదేశం

గత నెలలో ప్రభుత్వం ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌లతో జరిగిన సమావేశంలో ఎడిబుల్ ఆయిల్‌ల ఎంఆర్‌పిని తగ్గించాలని ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆదేశించింది. దీంతో లీటరుకు రూ. 10 నుంచి రూ. 12 వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు కూడా ధర తగ్గింపు తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచించింది. తయారీదారులు/రిఫైనర్‌ల ద్వారా పంపిణీదారులకు ధర తగ్గింపు జరిగినప్పుడల్లా, పరిశ్రమ ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందించబడాలని, డిపార్ట్‌మెంట్‌కు క్రమ పద్ధతిలో సమాచారం అందించబడుతుందని కూడా ఇది ప్రభావితమైంది. తమ ధరలను తగ్గించని, ఇతర బ్రాండ్‌ల కంటే వాటి MRP ఎక్కువగా ఉన్న కొన్ని కంపెనీలు కూడా వాటి ధరలను తగ్గించాలని కేంద్రం సూచించబడ్డాయి. దీంతో వారం రోజుల వ్యవధిలో వంట నూనెల ధరలు లీటర్ పై రూ. 10 నుంచి రూ. 12 తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు