Cooking Oil Price : వంటనూనెల ధరలను తగ్గించండి-కేంద్రం ఆదేశం
గత కొద్ది కాలంగా పెరుగుతూ పోతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Cooking Oils Price
Cooking Oil Price : గత కొద్ది కాలంగా పెరుగుతూ పోతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారం రోజుల్లోగా అన్ని వంట నూనెలపై లీటరుకు రూ.10 తగ్గించాల్సిందిగా కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షుపాండే ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గినందున భారత్‌లో కూడా ధరలు తగ్గించాలని సూచించారు.
దేశ వ్యాప్తంగా ఒక బ్రాండ్ వంటనూనెకు ఒకే ఎంఆర్‌పీని పాటించాల్సిందిగా కోరారు. దేశంలో వంట నూనెల అవసరాల కోసం 60 శాతం పైగా దిగుమతులు జరుగుతున్నాయి. కొన్నినెలలుగా అంతర్జాతీయంగా నూనె ధరలలో తగ్గుదల రావటంతో కేంద్ర ప్రభుత్వం నూనె ధరలు తగ్గించమని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది.
గత నెలలో నూనె ధరను లీటరుకు రూ.10-15 వరకు ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. తగ్గించిన ధరలను వినియోగ దారులకు బదలాయించాలని వంటనూనెల సంఘాలు, ప్రధాన తయారీ కంపెనీలకు జాతీయ ఆహార కార్యదర్శి సుధాన్షుపాండే ఆదేశించారు.
Also Read : Trending Words: ట్రెండింగ్‌లోని ఇంగ్లీష్ పదాలు.. మీకు తెలుసా