Coromandel Express: ఘోర ప్రమాదం తర్వాత నేటి నుంచి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పునఃప్రారంభం

ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి మళ్లీ పట్టాలెక్కింది.ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది....

Coromandel Express

Coromandel Express Resume Services: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ జూన్ 2వ తేదీన బాలాసోర్‌లోని బహనాగా రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలును ఢీకొన్న ఘటనలో 288 మంది మరణించగా, 1000మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన 5 రోజుల తర్వాత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బుధవారం నుంచి తన సేవలను పునఃప్రారంభించిందని ఉందని రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు.

Goods Train Derails: మధ్యప్రదేశ్‌లో ఎల్పీజీతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది

రైళ్ల పునరుద్ధరణతో షాలిమార్ – చెన్నై సెంట్రల్ మార్గంలో ప్రయాణికులకు సౌకర్యం ఏర్పడింది. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సోమవారం హౌరా-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒడిశాలోని బాలాసోర్‌లో పునరుద్ధరించిన రైల్వే ట్రాక్‌పై దాటిన కొన్ని గంటల తర్వాత జిల్లాలో ప్యాసింజర్ రైలు సేవలు పునరుద్ధరించారు. బహనాగా రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదం వల్ల దెబ్బతిన్న రైలు మార్గాలను పునరుద్ధరించడంతో తిరిగి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ తోపాటు పలు రైళ్లను నడుపుతున్నారు.