Goods Train Derails: మధ్యప్రదేశ్‌లో ఎల్పీజీతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఎల్‌పీజీతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటన తర్వాత వరుస ఘటనలు జరుగుతున్నాయి. వరుస రైలు ప్రమాదాలతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు....

Goods Train Derails: మధ్యప్రదేశ్‌లో ఎల్పీజీతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది

Goods Train Derails

Goods Train Derails: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఎల్‌పీజీతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలోని భారత్ పెట్రోలియంకు చెందిన ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్లను ఖాళీ చేయడానికి వెళుతున్న గూడ్స్ రైలు నుంచి రెండు వ్యాగన్ల ఎల్‌పిజి రేకులు పట్టాలు తప్పాయి.(Goods train carrying LPG derails)పట్టాలు తప్పిన వెంటనే గూడ్స్ రైలును డ్రైవరు ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.(major accident averted) జబల్ పూర్ జిల్లాలోని షాపురా భిటోని స్టేషన్‌లోని భారత్ పెట్రోలియం డిపో సమీపంలో ఈ ఘటన జరిగింది.

Mumbai College girl : ముంబయి కాలేజీ హాస్టల్లో దారుణం

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ప్రమాద సహాయక వాహనంతో పాటు అర్థరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.రైల్వే కార్మికులు పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటన తర్వాత వరుస ఘటనలు జరుగుతున్నాయి. వరుస రైలు ప్రమాదాలతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలోనే బొగ్గు తీసుకువెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మళ్లీ జార్ఖండ్ రాష్ట్రంలో మరో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.

Major Train Accident Averted: డ్రైవర్ బ్రేక్ వేయడంతో తప్పిన పెద్ద రైలు ప్రమాదం

మంగళవారం రాత్రి న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 22812) వెళుతుండగా సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో రైల్వే గేట్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ట్రాక్టర్ రైల్వే ట్రాక్, గేట్ మధ్య ఇరుక్కుపోయింది.బొకారో జిల్లాలోని భోజుడిహ్ రైల్వే స్టేషన్ సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటును మూసివేస్తున్నప్పుడు ట్రాక్టర్ ఢీకొట్టింది. అయితే రైలు డ్రైవర్ బ్రేకులు వేయడంతో రైలు ఆగిపోయింది, దీంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.

Odisha train accident: గాలిలో దీపంలా రైల్వే ప్రయాణికుల భద్రత.. ఒడిశా ప్రమాదంతో వెలుగుచూస్తున్న లోపాలు

మరో వైపు బెంగళూరు ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి కాచిగూడ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ రైల్వేస్టేషన్ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. దీంతో ప్రమాదం తప్పింది.