Corona Second Wave: ఏపీలో కాలం చెల్లిన రెమిడిసివెర్ ఇంజెక్షన్ల కలకలం!

కరోనా విజృంభణ రెండో దశలో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. మొదటిదశ కంటే వైరస్ మరింత డేంజర్ గా మారిందనే ప్రచారం.. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది ఆసుపత్రుల పాలవుతుండడం కలిసి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. దీంతో కరోనాకు ఉపశమనంగా అందుబాటులోకి వచ్చిన మందుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు.

Corona Second Wave: కరోనా విజృంభణ రెండో దశలో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. మొదటిదశ కంటే వైరస్ మరింత డేంజర్ గా మారిందనే ప్రచారం.. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది ఆసుపత్రుల పాలవుతుండడం కలిసి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. దీంతో కరోనాకు ఉపశమనంగా అందుబాటులోకి వచ్చిన మందుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఆ మందులలో వైరస్ లోడ్ ను తగ్గించి త్వరగా కోలుకునేలా చేసే రెమిడిసివెర్ ఇంజెక్షన్ మందుకైతే విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ముందుకు బ్లాక్ మార్కెట్ కూడా భారీగానే నడుస్తుంది.

కరోనా రోగులకు మొత్తం 6 డోసులుగా ఇచ్చే ఈ ఇంజెక్షన్ ను ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలో కరోనా ఆసుపత్రులు వినియోగిస్తుండగా ఏపీలో కాలం చెల్లిన రెమిడిసివెర్ ఇంజెక్షన్ ఇస్తున్నారని కలకలం రేగింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాలం చెల్లిన మందులను ఇస్తున్నారని రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. కాలం చెల్లిన ఇంజక్షన్ బాటిల్ పై కొత్తగా మరో లేబుల్ అమర్చి ఇస్తున్నారని ఆరోపించారు. దీంతో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువుల మధ్య వాగ్వాదం నెలకొంది.

అయితే డాక్టర్స్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తున్నారు. ప్రభుత్వం నుండి మాకు వచ్చిన మందులనే ఇస్తున్నామని వాదిస్తున్నారు. రెమిడిసివెర్ మందును కంపెనీలు తయారు చేసిన సమయంలో వేసిన ఎక్స్ పైరీ డేట్ ని మించి మరో ఆరు నెలల వరకు పనిచేస్తుందని.. ఒక్క రెమిడిసివెర్ మాత్రమే కాదు.. చాలా రకాల మందులు అదే విధంగా పనిచేస్తాయని.. బహుశా అందుకే పాత మందులపై కొత్త లేబుల్ వేసి సరఫరా చేసి ఉంటారని వైద్యులు చెప్తున్నారు. కానీ అలా లేబుల్ వేసిన రెమిడిసివెర్ ఇంజెక్షన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని వైద్యులు చెప్తున్నారు. అయితే.. ఇది జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Read: Corona Second Wave: గోడ‌లు బ‌ద్ద‌లుగొట్టి మరీ 30 మంది కరోనా రోగుల ప‌రారీ..

ట్రెండింగ్ వార్తలు