Corona Second Wave: గోడ‌లు బ‌ద్ద‌లుగొట్టి మరీ 30 మంది కరోనా రోగుల ప‌రారీ..

మన దేశంలో ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం కొనసాగుతుంది. గత ఏడాది కంటే ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా, ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో బెడ్ల నుండి ఆక్సిజన్ కొరత వరకు దిక్కుతోచని స్థితి కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వాలు వైద్య సౌకర్యాలపై దృష్టి పెట్టి ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Corona Second Wave: గోడ‌లు బ‌ద్ద‌లుగొట్టి మరీ 30 మంది కరోనా రోగుల ప‌రారీ..

Corona Second Wave

Corona Second Wave: మన దేశంలో ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం కొనసాగుతుంది. గత ఏడాది కంటే ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా, ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో బెడ్ల నుండి ఆక్సిజన్ కొరత వరకు దిక్కుతోచని స్థితి కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వాలు వైద్య సౌకర్యాలపై దృష్టి పెట్టి ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. కొందరి నిర్లక్ష్యం వైరస్ వ్యాప్తికి మార్గమవుతుంది. కరోనా సోకి స్వల్ప లక్షణాలు ఉన్నా కొందరు బహిరంగంగా సమాజంలో కలిసి తిరుగుతుంటే మరికొందరు కోవిడ్ కేర్ సెంటర్ల నుండి తప్పించుకొని మరీ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు.

త్రిపుర రాష్ట్రంలో కోవిడ్ సెంటర్ నుండి ఒకేసారి ముప్పై మంది కోవిడ్ రోగులు తప్పించుకొని పోవడం కలకలం రేపుతోంది. ఈ ఘ‌ట‌న త్రిపుర‌లోని అరుంధ‌తి న‌గ‌ర్‌లో బుధ‌వారం చోటు చేసుకోగా అధికారులే ఈ ఘటనను బయటకు రాకుండా చూసినట్లు తెలుస్తుంది. త్రిపుర స్టేట్ రైఫిల్స్ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌లో భాగంగా ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రైన వారంద‌రికీ క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు. ఇంటర్వ్యూలకు హాజరైన మొత్తం 65 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అందులో 40 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణైన వారంద‌రినీ కొవిడ్ కేర్ సెంట‌ర్‌కు త‌ర‌లించి ఆహరం.. మందులు అందిస్తున్నారు. అయితే.. బుధవారం ఆ సెంట‌ర్ గోడ‌లు బ‌ద్ద‌లుగొట్టి మరీ 30 మంది ప‌రారీ అయ్యారు. రైఫిల్స్ రిక్రూట్‌మెంట్ అధికారులే ఈ విషయం బయటకు రాకుండా చూడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు, వైద్య అధికారులు ప్రస్తుతం తప్పించుకున్న పేషేంట్ల సెల్‌ఫోన్ లోకేష‌న్ ఆధారంగా వారు ఎక్క‌డున్నారో గుర్తించి వారిని తిరిగి కొవిడ్ సెంట‌ర్‌కు త‌ర‌లించే ప్ర‌క్రియ‌లో ఉన్నట్లు తెలుస్తుంది.