Viral Video: మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. ఓ అమ్మాయి, అబ్బాయి మీకిది తగునా?

Viral Video: ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చుట్టూ మనుషులు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయింది ఆ జంట.

Viral Video

Viral Video: ఢిల్లీ మెట్రో ట్రైన్‌ (Delhi Metro)లో ఓ అమ్మాయి, అబ్బాయి సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారు. ట్రైన్ లో సీట్లలో కాకుండా కింద కూర్చొని మరీ ముద్దులు పెట్టుకున్నారు. అబ్బాయి ఒడిలో అమ్మాయి హాయిగా పడుకుంది. ఆమెకు అబ్బాయి ముద్దులు పెట్టాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చుట్టూ మనుషులు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయింది ఆ జంట. తమను అందరూ చూస్తున్నారన్న సిగ్గు కూడా వారికి లేకుండా పోయింది. తమ లోకం తమదే అన్నట్లు వ్యవహరించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

అమ్మాయికి ఆ అబ్బాయి ముద్దు పెడుతున్నట్లు లేదని, ఆమె మూర్చపోతే సీపీఆర్ చేస్తున్నట్లు ఉందని ఒకరు జోక్ పేల్చారు. ఇంట్లో గోప్యత లేకపోవడంతో ఇలా మెట్రో ట్రైన్ లో ఆ పని కానిచ్చినట్లున్నారని మరొకరు సెటైర్ వేశారు. ఢిల్లీ మెట్రో ట్రైన్లలో ఇప్పటికే ఇటువంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.

ఓ ఘటన తర్వాత మరోటి వెలుగులోకి వస్తుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ ఇప్పటికే పలుసార్లు హెచ్చరించినా యువత వినిపించుకోకుండా అవే పనులు చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కన్న తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు.

Man saved the cow : ఆవు దూడని రక్షించడం కోసం అతను ఏం చేశాడంటే? .. మనసుని కదిలించే వీడియో వైరల్