Man saved the cow : ఆవు దూడని రక్షించడం కోసం అతను ఏం చేశాడంటే? .. మనసుని కదిలించే వీడియో వైరల్

అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అందరూ తమ ప్రాణాలు దక్కించుకోవాలనే ప్రయత్నిస్తారు.. కానీ ఓ వ్యక్తి తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆవు దూడని కాపాడటం కోసం సముద్ర కెరటాల్లోకి దూకేసాడు. అతని సాహసం అందరికీ కంట నీరు తెప్పిస్తోంది.

Man saved the cow : ఆవు దూడని రక్షించడం కోసం అతను ఏం చేశాడంటే? .. మనసుని కదిలించే వీడియో వైరల్

Man saved the cow

Updated On : May 10, 2023 / 3:54 PM IST

Man saved the cow :  సముద్రం అలలు భయంకరంగా ఉన్నాయి. ఆవు దూడ దారి తెలియక సముద్రంలోకి దిగి అలల్లో చిక్కుకుపోయింది. శ్యామ్ అనే వ్యక్తి ఒక్క క్షణం ఆలోచించకుండా నీటిలోకి దూకి దాని ప్రాణాలు కాపాడాడు. జంతువుల పట్ల మనిషికి ఎంత మానవత్వం ఉందో ఈ సంఘటన వల్ల తెలుస్తోంది.

ఆవుని ఆలింగనం చేసుకుంటే ఆరోగ్యం : క్యూ కడుతున్న జనాలు

ఎటునుంచి వచ్చిందో చిన్న దూడపిల్ల సముద్రంవైపుకి వచ్చింది. దారి తెలియక సముద్రపు అలల్లోకి అడుగులు వేసి మునిగిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన శ్యామ్ అనే వ్యక్తి ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. వెంటనే సముద్రంలోకి దూకేశాడు. దాని కాళ్లు పట్టుకుని సురక్షితంగా గట్టు వైపుకి తీసుకొచ్చాడు. మరో వ్యక్తి  సాయంతో దానిని ఒడ్డుకి చేర్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను  @raunaksingh1170 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. లక్షలాది మంది ఈ వీడియోని చూసారు.

Cow Eat 50kgs Plastic : 50కిలోల ప్లాస్టిక్..ఆమ్యామ్యా.. అనిపించిన ఆవు

ఆవుదూడని కాపాడిన శ్యామ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. కెరటాల ఉధృతిని లెక్క చేయకుండా తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఆవుని రక్షించిన అతని ధైర్య, సాహసాలను మెచ్చుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Raunak Singh (@raunaksingh1170)