Home » kindness
ఇటీవలే పాములు పట్టే వ్యక్తినే పాము కాటేసిందనే వార్తలు విన్నాం. ప్రమాదకరమైన సరీసృపాలకు నీళ్లు అందించడమంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఓ వ్యక్తి ఎంతో దయతో ధైర్యంగా కోబ్రాకు మంచినీరు ఎలా తాగించాడో చూసి నెటిజన్లు షాకవతున్నారు.
అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అందరూ తమ ప్రాణాలు దక్కించుకోవాలనే ప్రయత్నిస్తారు.. కానీ ఓ వ్యక్తి తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆవు దూడని కాపాడటం కోసం సముద్ర కెరటాల్లోకి దూకేసాడు. అతని సాహసం అందరికీ కంట నీరు తెప్పిస్తోంది.
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. కానీ చేసిన సాయం తెలిస్తేనే ఇతరులు స్ఫూర్తి పొందుతారు. సాయం చేయడంలో గొప్ప ఆనందం ఉంటుంది. పొందిన సాయాన్ని మర్చిపోకుండా ఉండటమే సాయం చేసిన వారికి ఇచ్చే నిజమైన గౌరవం. ఈరోజు వరల్డ్ గివ్ డే.
కొన్ని సంఘటనలు చూస్తే స్పందించే హృదయాలు రేర్‌గా ఉంటాయి అనిపిస్తుంది. వర్షంలో తడిసి ముద్దయిపోతున్న తల్లీబిడ్డల్ని చూస్తే ఆ రోడ్డున పోయే వారిలో ఎవ్వరికీ మనసు కరగలేదు. అప్పుడే ఓ వ్యక్తి చేసిన మంచిపని అందరి మన్ననలు పొందుతోంది.
రోడ్ సైడ్ ఎంతోమంది వృద్ధులు నడవలేని స్థితిలో వెళ్తుంటారు. వారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. మంచినీరు కూడా తాగలేని ఓ వృద్ధుడిని చూసి ఓ చిన్నారి చలించిపోయింది. వెంటనే ఆమె చేసిన పనికి ఇంటర్నెట్ మొత్తం కదిలిపోయింది.
వయసు నాలుగేళ్లే.. కానీ స్నేహం, దయాగుణం అనే కాన్సెప్ట్ ల మీద పుస్తకం రాసేంత మేధాశక్తి. అతని అద్భుతమైన తెలివితేటలకి గిన్నిస్ బుక్ అబ్బురపడిపోయింది. నాలుగేళ్లకే పుస్తకం రాసేసిన చిన్నారికి తమ రికార్డ్స్ లో స్ధానం కల్పించింది.