A kind man : వర్షంలో తడిసిపోతున్న తల్లీబిడ్డలకి సాయం చేసిన ఓ వ్యక్తి కోట్లాది మనసులు గెలుచుకున్నాడు..

కొన్ని సంఘటనలు చూస్తే స్పందించే హృదయాలు రేర్‌గా ఉంటాయి అనిపిస్తుంది. వర్షంలో తడిసి ముద్దయిపోతున్న తల్లీబిడ్డల్ని చూస్తే ఆ రోడ్డున పోయే వారిలో ఎవ్వరికీ మనసు కరగలేదు. అప్పుడే ఓ వ్యక్తి చేసిన మంచిపని అందరి మన్ననలు పొందుతోంది.

A kind man : వర్షంలో తడిసిపోతున్న తల్లీబిడ్డలకి సాయం చేసిన ఓ వ్యక్తి కోట్లాది మనసులు గెలుచుకున్నాడు..

A kind man

Updated On : April 16, 2023 / 3:43 PM IST

A kind man : భోరున వర్షం పడుతోంది. ఓ తల్లీ, బిడ్డ వర్షంలో తడుస్తూ రోడ్డు మీద వెళ్తున్నారు. ఆ దారిన వెళ్తున్న ఎవరికీ వాళ్లని చూస్తే జాలి అనిపించలేదు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చేసిన మంచి పని అందరి హృదయాలు గెలుచుకుంది.

Children’s Amazing Dance : ‘పర్దేశియా’ సాంగ్‌కి దుమ్మురేపుతున్న చిన్నారులు వీడియో వైరల్

సాధారణంగా బస్సుల్లో చూస్తూ ఉంటాం.. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు నిలబడే ఉన్నా కొందరు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. సీటు ఇవ్వమని అడిగితే దెబ్బలాటకు దిగుతారు. ఇక రోడ్లపై మనుష్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్క క్షణం ఆగి పట్టించుకునేందుకు కూడా ఎవరూ టైం ఇవ్వరు. తాజాగా వర్షంలో తడిసి ముద్దైపోతున్న ఓ తల్లీబిడ్డలకు తన గొడుగు (umbrella) ఇచ్చిన ఓ వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఏం ఉంది అనుకోవద్దు.. అతని మంచి హృదయం ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంది. కృతజ్ఞతతో నమస్కరించిన ఆ మహిళను తాను దీవిస్తున్నట్లు చేయి చూపించి వెళ్లాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రపంచాన్ని దయతో మార్చేద్దాం’ అనే క్యాప్షన్ తో షేర్ అయిన ఈ వీడియో మనకి పరిచయం లేని వారి పట్ల కూడా ఎలా దయని ప్రకటించవచ్చునో నేర్పుతోంది.

dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

ఈ ప్రపంచంలో మానవత్వం ఇంకా బతికే ఉందని కొందరు.. ప్రేమ, దయతో ఈ ప్రపంచంలో గెలవలేనిది ఏదీ లేదని మరికొందరు అభిప్రాయాలు చెప్పారు. మరోవైపు ఆ తల్లీ బిడ్డలకు వర్షంలో సాయం అందించిన వ్యక్తిపై అభినందనల జల్లు కురుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Good News Movement (@goodnews_movement)