dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ కొందరే దానికి పదును పెట్టుకుని పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. పోలీస్ వృత్తిలో ఉంటే ఏమి ఓవైపు తన వృత్తికి న్యాయం చేస్తూనే మరోవైపు తన టాలెంట్‌తో దూసుకుపోతున్నారు ఓ పోలీస్.

dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

dancing cop

Updated On : April 16, 2023 / 10:13 AM IST

dancing cop :  పోలీస్ అంటే ఎప్పుడు సీరియస్‌గా ఉంటారు.. వాళ్లకు ఎప్పుడు పోలీస్ స్టేషన్ (police station), కేసులు చుట్టూ తిరుగుతూ ఉంటారు అనుకుంటాం. నిజమే వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారిలో కూడా చాలా నైపుణ్యాలు ఉంటాయి. టైం దొరికితే కొందరు బయటపెడుతుంటారు. ఓ ముంబయి పోలీస్ డ్యాన్సింగ్ టాలెంట్ జనాల్సి ఆకట్టుకుంటోంది.

Mud Puddling : బురద నుంచి సాల్ట్ సేకరిస్తున్న రంగు రంగుల సీతాకోక చిలుకల వీడియో వైరల్

పోలీసు వృత్తి చాలా సవాళ్లతో కూడుకున్నది. వాళ్లకి ఓ టైం అంటూ ఉండదు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పట్టించుకోవాలి. ఈ వృత్తిలో ఉన్నవారు ఒక్కోసారి ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయలేరు. అయితే ఓ పోలీస్ కొంచెం టైం దొరికితే చాలు డ్యాన్స్ చేసేస్తారు. ముంబయికి (mumbai) చెందిన అమోల్ కాంబ్లీ (amolkamble) తన స్టెప్పులతో అదరగొడుతున్నారు. అంతకు ముందు ఆయన రణ్‌వీర్‌సింగ్ (Ranveer Singh)పక్కన వేసిన స్టెప్పులు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా వర్కవుట్ చేస్తూ వేసిన స్టెప్పుల్ని రాఘవ్ అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేయడంతో మరోసారి వైరల్ అయ్యారు అమోల్ కాంబ్లీ.

Divorce photoshoot : విడాకుల ఫోటో షూట్‌తో వైరల్ అవుతున్న అమ్మడు.. ఫోటోలు చూస్తే షాకవుతారు

సోషల్ మీడియాలో చాలామంది ప్రతిభావంతులు తమ టాలెంట్‌ని ప్రదర్శిస్తున్నారు. వారందరినీ దాటుకుంటూ వ్యూస్‌తో ముందుకు రావడం అంటే ఎంతో ప్రతిభ ఉండి ఉండాలి. ఇక అమోల్ కాంబ్లీ డ్యాన్స్‌కి ఫిదా అయిన నెటిజన్లు (netizens) తెగ కామెంట్లు పెడుతున్నారు. స్టెప్పులు ఇరగదీస్తున్నారు అని కొందరు .. మీ ప్రదర్శన అద్భుతం అని కొందరు కితాబు ఇస్తున్నారు. స్వతహాగా టాలెంట్ ఉండటంతో పాటు వృత్తిపరమైన ఒత్తిడిని తట్టుకోవడానికి కూడా ఈ పోలీస్ ఇలా డ్యాన్స్ చేస్తూ ఉండి ఉండచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అమోల్ కాంబ్లీ ఒక మంచి పోలీస్‌తో పాటు.. మంచి డ్యాన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amol Kamble (@amolkamble2799)

 

View this post on Instagram

 

A post shared by Amol Kamble (@amolkamble2799)