King Cobra : కింగ్ కోబ్రాకు నిర్భయంగా నీళ్లు తాగించిన వ్యక్తి.. షాకైన నెటిజన్లు

ఇటీవలే పాములు పట్టే వ్యక్తినే పాము కాటేసిందనే వార్తలు విన్నాం. ప్రమాదకరమైన సరీసృపాలకు నీళ్లు అందించడమంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఓ వ్యక్తి ఎంతో దయతో ధైర్యంగా కోబ్రాకు మంచినీరు ఎలా తాగించాడో చూసి నెటిజన్లు షాకవతున్నారు.

King Cobra : కింగ్ కోబ్రాకు నిర్భయంగా నీళ్లు తాగించిన వ్యక్తి.. షాకైన నెటిజన్లు

King Cobra

Updated On : June 20, 2023 / 3:12 PM IST

King Cobra : ఎండాకాలం పూర్తైనా ఏ మాత్రం వేడి తగ్గలేదు. మనుష్యులు వేడిని తట్టుకోలేకపోతుంటే జంతువుల పరిస్థితి మరీ ఘోరం. వీటికి సరైన ఆహారం, నీరు దొరకక చనిపోతుంటాయి. అయితే ప్రమాదకరమైన సరీసృపాలకు నీరు అందించడమంటే మనం ఆమడ దూరం పరుగులు పెడతాం. కానీ ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాకి ఎంతో ధైర్యంగా.. దయతో నీళ్లు పట్టిస్తున్న వీడియో నెటిజన్లను షాక్‌కి గురి చేసింది.

King Cobra : OMG.. ప్రాణాలను పణంగా పెట్టి భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

world_of_snakes_ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో భారీ పాముకి ఓ వ్యక్తి నిర్భయంగా నీళ్లు అందిస్తున్నాడు. ఎటువంటి భయం కానీ, సంకోచం కానీ లేకుండా అతను చేసిన పని చాలామంది నెటిజన్ల మనసుని కదిలించింది. సోషల్ మీడియాలో షేరైన ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రతి వ్యక్తిలో జంతువుల పట్ల దయ, కరుణ ఉన్నా.. వాటికి సాయం చేయడానికి ధైర్యం కావాలి.. ఏ మాత్రం ఏమరుపాటుతనంతో వ్యవహరించినా  ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. అలాంటి ప్రమాదకర జంతువులకి సైతం మానవత్వాన్ని చూపించిన వ్యక్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

King Cobra: కోబ్రాతో అట్లుంటడి మరి.. కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకొనేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. అది ఏం చేసిందంటే.. వీడియో వైరల్..

‘కొంతమంది మనిషి యొక్క దయగల చర్య’ అంటూ ప్రశంసించారు. అతని ధైర్యాన్ని, నిస్వార్థతను చాలామంది మెచ్చుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ?Ꮗ Ꭷ Ꮢ Ꮭ Ꮄ ᎧᎦ Ꮥ Ꮑ Ꮧ Ꮶ Ꮛ Ꮥ? (@world_of_snakes_)