Cow Eat 50kgs Plastic : 50కిలోల ప్లాస్టిక్..ఆమ్యామ్యా.. అనిపించిన ఆవు
కరీంనగర్ జిల్లా పశువైద్య శాలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆవుని తీసుకువచ్చారు. దానిని పరీక్షించి ఆపరేషన్ చేసిన వైద్యులు దాని కడుపులోంచి 50 కిలోల ప్లాస్టిక్ ను బయటకు తీశారు. సరైన పశుగ్రాసం అందక.. ఆకలికి అలమటిస్తూ ప్లాస్టిక్ తిన్న ఆవు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

Cow Eat 50kgs Plastic
Cow Eat 50kgs Plastic : కరీంనగర్ జిల్లాలో (karimnagar) అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు (Cow) యజమాని దానికి సరైన గ్రాసం పెట్టట్లేదో ఏమో? దొరికినప్పుడల్లా ప్లాస్టిక్ తింటూ వచ్చింది. అలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 50కిలోల ప్లాస్టిక్ తిని ప్రాణం మీదకు తెచ్చుకుంది. జిల్లా పశు వైద్యశాల ఆసుపత్రి వైద్యులు (district hospital) సమయానికి ఆపరేషన్ చేసి ఆవు ప్రాణాలు కాపాడారు.
కరీంనగర్ జిల్లా పశువైద్యశాలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆవును దాని యజమాని తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేసి ఆవు పొత్తి కడుపులో 50 కిలోల ప్లాస్టిక్ (plastic) ను బయటకు తీశారు. సాధారణంగా పశువులు రోజులో 20 నుంచి 25 కిలోల పశుగ్రాసం తింటాయి. అయితే వాటికి సరైన పశుగ్రాసం దొరకక ఆకలి తీర్చుకోవడం కోసం ప్లాస్టిక్ తింటున్నాయి.
ఈ సంఘటన చూసైనా పశువుల కాపరులు తమ పశువులు (Cattle) ప్లాస్టిక్ తినకుండా చూడాలని వైద్యులు సూచించారు. వాటికి తగిన పశుగ్రాసం (fodder) అందేలా చూడాలని చెప్పారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైన పశువులను తమ వద్దకు తీసుకుని వస్తే చికిత్స అందిస్తామని తెలిపారు.
కరీంనగర్, సింగరేణిపై సినిమా తీస్తా : బిగ్‌బాస్ ఫేం సోహెల్
ఇక ఓ వైపు ప్లాస్టిక్ వినియోగం.. దాని వల్ల జరుగుతున్న హాని గురించి ప్రజల్లో ఎంత చైతన్యం కలిగించినా మార్పు కనిపించట్లేదు. ప్లాస్టిక్ వినియోగం మనుష్యులకే కాదు మూగజీవాలకు సైతం ప్రాణాల మీదకు తీసుకువస్తోంది. కనీసం ఇలాంటి సంఘటనలు చూసేనా ప్రజల్లో మార్పు రావాలని కోరుకుందాం.