Drunken Man Hulchul : పిచ్చ కామెడీ.. నాకు టైఫాయిడ్ వచ్చింది, అందుకే మందు తాగా.. తప్పేంటి? కరీంనగర్‌లో మందుబాబు రచ్చ రచ్చ

న్యూ ఇయర్ వేళ.. కరీంనగర్ లో ఓ మందు బాబు రోడ్డుపై హల్ చల్ చేశాడు. డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన మందుబాబు.. రోడ్డుపై రచ్చ చేశాడు.

Drunken Man Hulchul : పిచ్చ కామెడీ.. నాకు టైఫాయిడ్ వచ్చింది, అందుకే మందు తాగా.. తప్పేంటి? కరీంనగర్‌లో మందుబాబు రచ్చ రచ్చ

Updated On : January 1, 2023 / 12:08 PM IST

Drunken Man Hulchul : న్యూ ఇయర్ వేళ.. కరీంనగర్ లో ఓ మందు బాబు రోడ్డుపై హల్ చల్ చేశాడు. డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన మందుబాబు.. రోడ్డుపై రచ్చ చేశాడు.

మందు తాగి వాహనం నడపటం నేరం. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాలు తెలిసినా, అతడు పోలీసులతో అడ్డంగా వాదించాడు. న్యూ ఇయర్ వేళ తాగితే తప్పేంటి? అని పోలీసులను ఎదురు ప్రశ్నించాడు. నా బండి ఎందుకు లాక్కున్నారు? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. డిసెంబర్ 31 అని తాగినా. తప్పేంటి? అంటూ గోల చేశాడు. ఆ వ్యక్తి బాగా మందు తాగేశాడు. దీంతో అతడికి కిక్కు ఎక్కేసింది. ఈ క్రమంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా అతడికే తెలియలేదని పోలీసులు అన్నారు.

Also Read..Hyderabad Police Tough Decision : మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే.. రూ.15 వేలు జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష

”నేను బిర్యానీ మాస్టర్ ని. ఇవాళ్ల డిసెంబర్ 31. అవును నేను తాగినా. నాకు టైఫాయిడ్ వచ్చింది. అందుకే మందు తాగినా. అయితే తప్పేంటి? పొద్దున నుంచి తాగలేదు. ఇప్పుడు తాగినా. అయితే తప్పేంటి? 31వ తేదీ అని తాగినా. మరో రోజు అయితే తాగుతానా? డిసెంబర్ 31 అని తాగినా. ఏమైతది. పోలీసులు నా బండి ఎందుకు లాక్కున్నారు. నేను బండిని నడపగలను. పోలీసులు నా బండి తీసుకుని రేపు రమ్మంటున్నారు.

Also Read..Bihar Adulterated Liquor : బీహార్ లో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి.. కీలక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

తాగడం తప్పు కాదు కదా. ఈ ఇయర్ లాస్ట్. అందుకే తాగినా. తప్పేంటిది? రేపు కొత్త సంవత్సరం. అప్పుడు తాగుతానా నేను. ఈ పోలీసులు అప్పుడు పట్టుకుంటారా? పాత సంవత్సరం పోతుందనే బాధతోనే నేను తాగినా. తప్పేంటిది? పాత సంవత్సరంలో నాకు కలిసొచ్చింది. అందుకే తాగాను. ఇప్పుడేంటిది? రేపు పొద్దున నాకు కలిసొస్తదా? ట్రాఫిక్ వాళ్లు నా పర్సంటేజ్ నాకు ఇస్తారా?” అంటూ మద్యం మత్తులో ఆ మందుబాబు నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మందుబాబు మాటలకు నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.