Bihar Adulterated Liquor : బీహార్ లో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి.. కీలక నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
బీహార్ లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

adulterated liquor
Bihar Adulterated Liquor : బీహార్ లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రామ్ బాబు మహతోగా గుర్తించారు.
సరన్ జిల్లాలోని డోయిలా అతని స్వగ్రామం. నిందితుడు మహతో ఢిల్లీలో తల దాచుకున్నట్లు సమాచారం అందినట్లు క్రైమ్ బ్రాంచ్ కమిషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ పేర్కొన్నారు. టెక్నికల్ నిఘా, నిర్ధిష్ట సమాచారం ఆధారంగా మహతోను ద్వారక ప్రాంతంలో అరెస్టు చేసినట్లు యాదవ్ తెలిపారు.
నిందితుడు మహతోను అరెస్టు చేసిన విషయాన్ని బీహార్ పోలీసులకు తెలిపినట్లు ఢిల్లీ కమిషనర్ చెప్పారు. బీహార్ లో మద్యం పాన నిషేధం ఉందని, అయితే ఆ అవకాశాన్ని వినిగియోగించుకుని, త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో నిందితుడు కల్తీ మద్యం అమ్మకాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.