కరీంనగర్‌, సింగరేణిపై సినిమా తీస్తా : బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌

కరీంనగర్‌, సింగరేణిపై సినిమా తీస్తా : బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌

film on Karimnagar, Singareni says Big Boss Fame Sohel : కరీంనగర్‌, సింగరేణిపై సినిమా తీయాలని ఉందని బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రాంతవాసిగా తనకు కరీంనగర్‌, సింగరేణి ప్రాంతాలపై సినిమా రూపొందించాలని ఉందని, అలాంటి అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని సోహెల్‌ తెలిపారు. శృతి కల్చరల్‌ అకాడమీ అధ్యక్షులు యాగండ్ల అనిల్‌ కుమార్‌, గుగ్గిళ్ల శ్రీనివాస్‌, జనగాం సత్యనారాయణ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్టార్‌ మా నిర్వహించిన బిగ్‌బాస్‌ షో వల్ల తల్లిదండ్రుల విలువ తెలిసిందన్నారు సోహెల్. బిగ్‌బాస్‌ షోలో తనకు అవకాశం లభించడం గొప్ప విషయం, జీవితంలో మరిచిపోలేనిదని పేర్కొన్నారు. తనకు ఓట్‌ వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్‌, సింగరేణి ప్రాంత అభిమానులు, స్నేహితుల సహకారం ఎంతో ఉందన్నారు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో 100 రోజులు ఉంటే, చివరి రోజు నాగార్జున, చిరంజీవి చెప్పిన మాటలు, ఇచ్చిన సహకారం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఆర్‌ఎక్స్‌ సినిమా డైరెక్టర్‌ శ్రీనివాస్‌, మరో డైరెక్టర్‌ అప్పిరెడ్డి సినిమా మొదలవ్వబోతుందని, ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.